సీసీటీవీ కెమెరాను ఇలా కూడా మార్చొచ్చా.. ఏం ఐడియా బ్రో

ప్రస్తుతం టెక్నాలజీ యుగం నడుస్తోంది.టెక్నాలజీ అనేది విపరీతంగా అభివృద్ది చెందుతుంది.

 Change The Cctv Camera Like This Viral In Social Media , Cc Camera, Table Fan,-TeluguStop.com

అందులో భాగంగా సీసీకెమెరాలు కూడా కొత్త కొత్తవి వస్తున్నాయి.చిన్న సైజు మైక్రో కెమెరాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి.

అయితే ఇప్పుడు ఎక్కువమంది సెక్యూరిటీ కోసం సీసీ కెమెరాలను వాడుతున్నారు.తమ ఇంట్లో, షాపుల్లో సీసీ కెమెరాలను భద్రత కోసం పెట్టుకుంటున్నారు.

అలాగే రోడ్డ మీద, షాపింగ్స్ మాల్స్ లలో.ఇలా ఎక్కడ బట్టినా సీసీ కెమెరాలు కనిపిస్తున్నాయి.

అయితే తాజాగా సీసీ కెమెరా( CC camera )కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియా( Social media )లో చక్కర్లు కొడుతుంది.ఈ వీడియో చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు.ఒక వ్యక్తి గది మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యేలా ఏర్పాటు చేయాలని భావించాడు.దీని కోసం ఇప్పుడు చాలామంది 360 డిగ్రీల సీసీటీవీ కెమెరాలు వాడుతున్నారు.

కానీ 360 డిగ్రీల సీసీటీవీలు చాలా ఖరీదైనవి.దీంతో ఒక వ్యక్తి దీనికి మంచి పరిష్కారం కనుగొన్నాడు.

ఒక కొత్త ఐడియాతో చవకైన పరిష్కారం కనిపెట్టాడు.

టేబుల్ ఫ్యాన్‌ ( Table fan )ఇంజిన్‌పై సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేశాడు.దీంతో ఫ్యాన్ ఆన్ చేయగానే అది అటూ ఇటు తిరుగుతుండంతో దానిపై ఉన్న కెమెరా కూడా అుట, ఇటు తిరుగుతుంది.దీంతో రూమ్ మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవుతుంది.360 డిగ్రీల సీసీటీవీ కెమెరా తరహాలో రూమ్ మొత్తం కవర్ చేస్తుంది.ఇతడి ఐడియా అందరినీ ఆకట్టుకుంటుంది.

ఖర్చు తగ్గించుకునేందుకు అతడి ఐడియాను జనాలను ఉపయోగించుకుంటున్నారు.వరల్డ్ ఆఫ్ ఇంజినీరింగ్ అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ లో ఈ వీడియోను షేర్ చేశాడు.

దీంతో ఈ వీడియోకు రూ.కోటి వ్యూస్ వచ్చాయి.అలాగే లైక్స్ కూడా లక్షల్లో వస్తున్నాయి.ఐడియా సూపర్ అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube