స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.ఈ మేరకు విచారణను ఏపీ హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది.
విచారణలో భాగంగా చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టును సమయం కోరారు.దీంతో విచారణను న్యాయస్థానం ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది.
అయితే స్కిల్ డెవలమ్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు విజయవాడలోని ఏసీబీ కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.రాజకీయ కక్షతోనే తనను అరెస్ట్ చేశారన్న చంద్రబాబు తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు.