కరోనా వైరస్ ని కంట్రోల్ చేయడానికి భారత్ కీలక నిర్ణయం

చైనాలో కరోనా వైరస్ రోజురోజుకి విస్తరిస్తుంది.ఇక ఈ వ్యాధి బారిన పడే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది.

 Carona Evisa China-TeluguStop.com

ఇందులో మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది.దీనిని కంట్రోల్ చేయడానికి చైనా ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది.

జంతువుల నుంచి సంక్రమించిన ఈ వ్యాధి ప్రభావం అక్కడ విపరీతంగా ఉంది.ఇదిలా ఉంటే ప్రపంచ దేశాలన్నీ ఈ కరోనా వైరస్ తమ దేశంలోకి రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ఇక చైనాకి అనుకోని ఉన్న భారత్ కూడా ఈ కరోనా వైరస్ పట్ల ఇప్పటికే అప్రమత్తంగా ఉంది.రెండు ప్రత్యేక విమానాల ద్వారా చైనాలోని వుహాన్‌ నగరం నుంచి 600 మందికి పైగా భారతీయులను కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి రప్పించింది.

ఇదిలా ఉంటే ఈ కరోనా వైరస్ ఇండియాలోకి రాకుండా నియంత్రించడానికి భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.చైనీయులకు, చైనాలో నివసిస్తున్న విదేశీయులకు ఆన్‌లైన్‌ వీసా సౌకర్యాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్టు భారత్ ప్రకటించింది.

తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని బీజింగ్‌లోని భారత ఎంబసీ వెల్లడించింది.ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ-వీసా మీద భారత పర్యటనకు వెళ్లాలనుకే సౌకర్యాన్ని తాత్కాలికంగా రద్దు చేశారు.

తప్పనిసరి పరిస్థితుల్లో భారత్ వెళ్లాలనుకునేవారు బీజింగ్‌లోని భారత ఎంబసీ కార్యాలయాన్ని, షాంఘై, గ్వాంగ్జౌ నగరాల్లోని భారత కాన్సులేట్‌లను సంప్రదించవచ్చునని సూచించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube