యంగ్ హీరో నాని త్వరలో మారుతి దర్శకత్వంలో ఒక సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెల్సిందే.ఆ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతుంది.
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన మారుతి తాజాగా నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.ఈ సినిమాలో తన గత చిత్రం ‘బస్టాప్’లో నటించిన శ్రీదివ్యను హీరోయిన్గా ఎంపిక చేయాలని మారుతి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
తమిళంలో బిజీగా ఉన్నా కూడా మారుతిపై గౌరవంతో శ్రీదివ్య ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
బూతు చిత్రంగా పేరు తెచ్చుకున్న ‘బస్టాప్’ సినిమాలో శ్రీదివ్య యాక్టింగ్‌కు మంచి మార్కులే పడ్డాయి.
ఆ సినిమా యూత్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.దాంతో తెలుగులో అవకాశాలు రాకున్నా ఈ అమ్మడికి తమిళనాట ఫుల్ క్రేజ్ ఉంది.
ప్రస్తుతం చిన్న హీరోయిన్లలో స్టార్ హీరోయిన్గా ఉన్న అమ్మడు తమిళనాట భారీ పారితోషికాన్నే వసూళ్లు చేస్తోంది.ఇక ఈమె తెలుగు అమ్మాయి కావడంతో తెలుగులో తన సత్తా చాటాలనే కోరికతో ఉంది.
మరి అంది వచ్చిన ఈ అవకాశాన్ని అందుకుని, ఈ అమ్మడు తెలుగులో నానితో చేయబోతున్న సినిమా సక్సెస్ కొట్టి టాలీవుడ్లో కూడా జెండా పాతుతుందేమో చూడాలి.