స్మార్ట్ ఫోన్లో స్మార్ట్ గా రావణ దహనం.. వైరల్ వీడియో..

విజయదశమి సందర్భంగా ప్రతి సంవత్సరం రావణ దహన కార్యక్రమం దేశవ్యాప్తంగా చేస్తారు.మనదేశంలో చాలాచోట్ల ఈ కార్యక్రమాన్ని ఓ పెద్ద వేడుకలా నిర్వహిస్తుంటారు.

 Burning Of Ravana Smartly On Smart Phone Viral Video , B.tech Students, Gorakhp-TeluguStop.com

దసరా సందర్భంగా గోరఖ్‌పూర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ బీటెక్ విద్యార్థులు రావణ దహన కార్యక్రమం వెరైటీగా ప్లాన్ చేశారు.స్మార్ట్ ఫోన్ తో వెరైటీగా రావణా దహనం చేయాలనుకున్నారు.

స్మార్ట్ ఫోన్ తో రావణా దహనాన్ని చేసి దసరా పండుగ లో ప్రజలకు ఆశ్చర్యాన్ని కలగజేశారు.అయితే కొందరు బీటెక్ విద్యార్థులు ఇలాంటి సాంకేతిక ఆవిష్కరణలు అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి.

న్యూస్ ఏజెన్సీ అయిన ఏఎన్ఐ ఈ వీడియోను ట్వీట్ చేసింది.ప్రస్తుతం ఈ విడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.విద్యార్థుల తో పాటు ప్రొఫెసర్లు కూడా కలిసి ఈ ప్రయోగం చేశారు.సుమారు మూడు ఫీట్ల రావణుడి దిష్టిబొమ్మను తయారు చేసి, స్మార్ట్‌ఫోన్‌తో ఇలా క్లిక్ చేయగానే కొన్ని సెకండ్లలో రావణుడి దిష్టిబొమ్మ కాలిపోయింది.

స్మార్ట్‌ఫోన్ నుంచి రావణుడి దిష్టిబొమ్మకు ఓ వైర్ తో కనెక్ట్ చేసి, ఆ తర్వాత డివైజ్ ఆపరేట్ చేయగానే రావణుడి దిష్టిబొమ్మ దహనమైంది.పెద్ద శబ్దంతో ఆ రావణుడి దిష్టిబొమ్మలో నుంచి పొగలు వచ్చి కాలిపోయిన దృశ్యం వీడియోలో చూడవచ్చు.

ఇప్పటి వరకు ఈ వీడియోకు 43 వేలకు పైగా ప్రజలు చూశారు.ఈ బీటెక్ విద్యార్థుల ప్రతిభను వీడియోలో చూసిన వారందరూ ప్రశంసిస్తున్నారు.దసరా రోజున రాముడి జీవిత చరిత్రను రామ్‌లీలా పేరుతో నాటక ప్రదర్శన కూడా వేస్తారు.ఆ తర్వాతే రావణ దహనం కార్యక్రమం జరుపుతారు.దసరా పండుగ రోజున రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయడం ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న ఆచారం.అసలు దసరా పేరు దీని నుండే వచ్చింది.

సంస్కృతంలో దశ అంటే పది, హర అంటే ఓడించడం అని అర్థం.పది తలలు ఉన్నా రావణుని యుద్ధం చేసి ఓడించారు కాబట్టి దశహర అనే పేరు వచ్చింది.

ఆ పేరు కాస్తా దసరాగా మారిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube