స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పెళ్లి పెటాకులు చేస్తానంటున్నాడు ఓ స్టార్ డైరెక్టర్.అయితే ఇదంతా నిజజీవితంలో కాదులెండీ.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో బన్నీ తన నెక్ట్స్ మూవీని తెకెక్కించనున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది.
ఈ సినిమాకు మిగతా సినిమాలలాగా కాకుండా ఓ వినూత్న స్టార్టింగ్ పాయింట్‌తో తెరకెక్కించేందుకు సుకుమార్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో బన్నీ ఓ లారీ డ్రైవర్‌గా నటించనున్నాడు.
అయితే సినిమా స్టార్టింగ్‌లోనే బన్నీ-రష్మికల పెళ్లి జరుగుతుందని, ఆ తరువాత వారు కొన్ని కారణాల వల్ల విడిపోయి మళ్లీ ఎలా ఒకటయ్యారనే అంశాన్ని సినిమాలో చూపించనున్నాడు సుకుమార్.ఇంతవరకు సుకుమార్ ఇలాంటి కాన్సెప్ట్‌ను తెరకెక్కించలేదని, ఈ కాన్సెప్టుతో బన్నీ మరో బ్లాక్‌బస్టర్ కొట్టడం ఖాయమని సినిమా వర్గాలు అంటున్నాయి.
మొత్తానికి బన్నీ పెళ్లిని పెటాకులు చేసేందుకు సుకుమార్ ప్లాన్ ఎంతమేర వర్కవుట్ అవుతుందో చూడాలి అంటున్నారు ప్రేక్షకులు.అటు బన్నీ నటిస్తోన్న అల వైకుంఠపురములో సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది.
ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.