నేడు బీఆర్ఎస్ మరికాసేపటిలో స్వేదపత్రం విడుదల చేయనుంది.తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా విడుదల చేసిన శ్వేతపత్రాలకు కౌంటర్ గా బీఆర్ఎస్ స్వేదపత్రం విడుదల చేయనుంది.
ఈ మేరకు తెలంగాణభవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిద్ధం చేశారు.కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న విమర్శలకు స్వేద పత్రం ద్వారా కౌంటర్ ఇవ్వనున్నారు.
ఈ క్రమంలోనే దాదాపు తొమ్మిదిన్నరేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని కేటీఆర్ వివరించనున్నారు.అలాగే బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని కేటీఆర్ చెప్పనున్నారు.
రాష్ట్రం అప్పులు కాదు ఆస్తులను సృష్టించిందని కేటీఆర్ వివరించనున్నారు.