బ్రిలియంట్: దొంగలు కోసమే సెకండ్ ఫోన్ కొన్న యువతి.. వీడియో వైరల్‌..

దొంగల బెడద కొన్ని దేశాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది.వీరిని బురిడీ కొట్టించడానికి అప్పుడప్పుడు సామాన్యులు సైతం తెలివిగా ఆలోచిస్తుంటారు.

 Brilliant Young Woman Bought A Second Phone For Thieves Video Viral, Viral Vide-TeluguStop.com

తాజాగా ఒక మహిళ ఒక బ్రిలియంట్ ఐడియా చేసి దొంగను మోసం చేసింది.ఆమెకు సంబంధించిన వీడియోను ప్రముఖ ట్విట్టర్ పేజీ సీసీటీవీ ఇడియట్స్ షేర్ చేసింది.

దీనికి ఇప్పటికే 72 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

వైరల్ వీడియో ఓపెన్ చేస్తే మనకు ఒక బస్సులోని సీట్లో కూర్చున్న మహిళ కనిపిస్తుంది.

అంతలోనే టీ షర్ట్ ధరించిన ఒక దొంగ బస్సులోకి చొరబడ్డాడు.అతడిని చూడగానే మహిళ తన ముఖ్యమైన ఫోన్‌ను కాలు కింద దాచి పెట్టింది.

దొంగల కోసమే కొనుగోలు చేసిన లేదా పారేయడానికి రెడీగా ఉన్న వేరే డబ్బా ఫోన్‌ను చేతిలో పట్టుకుంది.దొంగ రాగానే అదే ఫోన్ ఇచ్చేసింది.

దొంగ దిగిపోయిన తర్వాత తన అసలైన ఫోన్ బయటికి తీసుకుంది.బస్సులోని మిగతా వారికి తన ఫోన్ చూపిస్తూ ఇదే నా అసలైన ఫోన్ అంటూ గర్వంగా చెప్పుకుంది.

అలా విలువైన, ముఖ్యమైన, తాను డైలీ వాడే ఫోన్ ( Daily use phone )సేవ్ చేసుకోగలిగింది.చెత్త ఫోన్ మాత్రం దొంగ ముఖాన కొట్టింది.ఈ మహిళ బ్రిలియంట్ ఐడియా తెలుసుకుని చాలా మంది స్టన్ అవుతున్నారు.ఈ మహిళకు తరచుగా దొంగలు ఎదురవుతుంటారట.వారితో గొడవ పెట్టుకుంటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.దానివల్ల దొంగలు అడగ్గానే మొబైల్ ఫోన్ ( Mobile phone )ఇవ్వక తప్పడం లేదు.

రోజూ వాడే విలువైన ఫోన్ ఇస్తే డబ్బులతో పాటు చాలా డేటా, కాంటాక్ట్స్ కూడా కోల్పోవాల్సి ఉంటుంది.

అలా కాకుండా మామూలు త్రో అవే ఫోన్ ఇస్తే ఆ దొంగ గండం నుంచి తప్పించుకోవచ్చు.అలాగే తక్కువ మనీ కోల్పోవచ్చు, అలానే డేటా కూడా వేరే వారి చేతిలో పడదు.ఇవన్నీ ఆలోచించి సదరు మహిళ ఆ ఐడియా చేసింది.

ఈ దొంగతనం ఘటన మెక్సికోలో చోటు చేసుకున్నట్లు కొందరు పేర్కొన్నారు.వైరల్ వీడియోను చూసి మహిళను చాలా మంది పొగుడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube