బిడ్డ శవాన్ని భుజాలపై మోశానంటూ కన్నీళ్లు పెట్టిన గంగవ్వ!

బుల్లితెర రియాలిటీ షోలలో ఇతర షోలతో పోలిస్తే బిగ్ బాస్ షో ప్రత్యేకం.తెలుగులో ఇప్పటికే మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో నెల రోజుల క్రితం గ్రాండ్ గా ప్రారంభమైంది.

 Bigg Boss Gangavva Emotional About Her Late Daughter, Gangavva, Bigg Boss Conte-TeluguStop.com

ఈ సీజన్ లో కంటెస్టెంట్లు అందరిలో అందరినీ ఆకర్షించిన కంటెస్టెంట్ గంగవ్వ.మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫేమస్ అయిన గంగవ్వ ఆరు పదుల వయస్సులో బిగ్ బాస్ షోలో పాల్గొనడం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.

లాంఛ్ ఎపిసోడ్ ప్రసారమైన తొలి రోజే గంగవ్వ ఫ్యాన్స్ పేరిట సోషల్ మీడియాలో గంగవ్వ ఆర్మీలు హల్చల్ చేశాయి.పైకి అమాయకంగా కనిపించే గంగవ్వ పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు.

నిన్నటి ఎపిసోడ్ లో గంగవ్వ తాను పెద్దగా ఏం చదువుకోలేదని.ఐదేళ్లకే పెళ్లి చేశారని చెప్పారు.15 సంవత్సరాల వయస్సులో కొడుకు పుట్టాడని కొడుకు పుట్టిన రెండేళ్లకు కూతురు పుట్టిందని వెల్లడించారు.తన భర్త తనను ఎప్పుడూ కొడుతూ ఇబ్బంది పెట్టేవాడని తెలిపారు.

భర్త మస్కట్ కు వెళతా డబ్బులు కావాలని అడిగాడని దెబ్బలైనా తప్పుతాయనే ఆలోచనతో అందుకు అంగీకరించానని అన్నారు.అయితే అదే సమయంలో కూతురుకు ఫిట్స్ రావడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లానని డాక్టర్లు పరిశీలించి చనిపోయిందని చెప్పారని బోరున ఏడ్చారు.

చనిపోయిన బిడ్డను భుజం మీద మోసుకుని బస్సు ఎక్కడానికి వెళితే బస్సులో ఎక్కించుకోమని చెప్పారని చివరకు ఆటోలో ఇంటికి తీసుకొచ్చానని అన్నారు.

కూతురు చనిపోయిన రోజు నుంచి తాను కడుపు నిండా తిండి తినలేదని, కొడుకు మందుకు బానిసయ్యాడంటూ గంగవ్వ ఆవేదన వ్యక్తం చేసింది.

పైకి సరదాగా నవ్వుతూ, నవ్విస్తూ కనిపించే గంగవ్వ పడిన కష్టాల గురించి తెలిసి హౌస్ లోని సభ్యులు కంటతడి పెట్టుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube