Inaya Sultana : అభిమానుల కల నెరవేరిందోచ్.. హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న ఇనయా సుల్తానా ?

తెలుగు పేక్షకులకు బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా( Inaya Sultana ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో లేడీ టైగర్ ఎవరు అనగానే టక్కున ఇనయా అని చెప్పేస్తూ ఉంటారు.

 Bigg Boss Fame Inaya Sultana All Set Debut Heroine-TeluguStop.com

బిగ్బాస్ షో నుంచి ఆమె ఎలిమినేట్ కాకముందే భారీగా పాపులారిటిని సంపాదించుకుంది ఇనయ.అంతేకాకుండా బిగ్ బాస్ సీజన్ 6( Bigg Boss Season 6 )లో ఏ కంటెస్టెంట్ కి రాని గుర్తింపు ఇనయకి వచ్చిందని చెప్పవచ్చు.కాగా బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కంటెస్టెంట్స్ అందరూ ఒక్కటై ఆమెను టార్గెట్ చేసినప్పటికీ ఆమె ఏ మాత్రం వెనకడుగు చేయకుండా అదే ధైర్యంతో ముందడుగు వేసి 13 వారాలపాటు హౌస్ సక్సెస్ఫుల్గా కొనసాగిందీ.

అందరూ ఆమెనే టార్గెట్ చేయడంతో ఆమెకు సింపతి బాగా పెరిగిపోయింది.

అయితే మొదటి రెండు వారిలోనేట్ అవుతుంది అనుకున్న ఆమె ఆ తర్వాత తన ఆట తీరుతో భారీగా పాపులారిటీని సంపాదించుకుంది.అయితే ప్రేక్షకుల అంచనాల ప్రకారం ఇనయా టాప్ 2 లేదా టాప్ 5 లో ఉంటుంది అని అనుకున్నారు.

కాని కనీసం ఆమె టాప్ ఫైవ్ లో కూడా లేకుండా అనూహ్యంగా ఆమెను ఎలిమినేట్ చేసి బయటకు పంపించిన విషయం తెలిసిందే.అయితే ఇనయాను ఎలిమినేట్ చేయడంతో బిగ్ బాస్ షో వద్ద గతంలో ఎన్ని రోజులు లేనివిధంగా ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే.

Telugu Bigg Boss, Inaya Sultana, Nata Rathnalu, Shivanagu-Movie

ఇనయాను ఎలిమినేట్( Eliminate Inaya ) ఎలా చేస్తారు అంటూ మండి పడ్డారు అభిమానులు.ఇనయా ఎలిమినేషన్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.ఈ సంగతి పక్కన పెడితే ఈమె బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇవ్వకముందే రామ్ గోపాల్ వర్మ బోల్డ్ ఇంటర్వ్యూ తో బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే.ఇక ఇనయా బస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత ఆమెను సినిమాలలో హీరోయిన్గా చూడాలని చాలామంది అభిమానులు ఆశపడ్డారు.

అభిమానులు ఆశలు నెరవేరాయి.

Telugu Bigg Boss, Inaya Sultana, Nata Rathnalu, Shivanagu-Movie

ఇనయా సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది.అయితే ఇనయా ఇది వరకే బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆడపాదడపా సినీమాలలో నటించినప్పటికీ సరైన గుర్తింపు దక్కలేదు.ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఇనయా ఒక సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది.

శివనాగు ( Shivanagu )దర్శకత్వం వహిస్తున్న నటరత్నాలు సినిమాలో హీరోయిన్ గా నటించనుంది.ఎవరెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో చందన ప్రొడక్షన్స్‌ పతాకంపై డా.దివ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.త్వరలోనే ఆ సినిమాకు సంబంధించి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు నిర్మాత తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube