ఒక్కడు షూట్ సమయంలో భూమిక అంత దారుణంగా ప్రవర్తించారా.. ఏమైందంటే?

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన భూమిక నటించిన సినిమాలలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి.ఖుషి, సింహాద్రి, ఒక్కడు సినిమాలు భూమిక సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

 Bhumika Scolded Fighter Details Here Goes Viral , Bhumika , Figher , Okkadu Mov-TeluguStop.com

అయితే ఇన్ని ఇండస్ట్రీ హిట్లు ఖాతాలో ఉన్నా భూమిక ఎక్కువ కాలం నటిగా కెరీర్ ను కొనసాగించలేకపోయారు.కొత్త హీరోయిన్ల ఎంట్రీతో భూమికకు సినిమా ఆఫర్లు తగ్గాయి.

ప్రస్తుతం అక్క, వదిన తరహా పాత్రల్లో భూమిక నటిస్తున్నారు.

అయితే భూమిక చాలా సాఫ్ట్ గా ఉంటారని ఎవరితో గొడవలు పెట్టుకోరని అందరూ అనుకుంటారు.

భూమిక సైతం వివాదాల ద్వారా పెద్దగా వార్తల్లో నిలవలేదు.అయితే తాజాగా రిలీజైన అలీతో సరదాగా ప్రోమోలో ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు ఒక్కడు మూవీ షూటింగ్ సమయంలో చోటు చేసుకున్న ఘటన గురించి వెల్లడించారు.నేను, మహేష్ బాబు, భూమిక పక్కపక్కన కూర్చుని ఉన్నామని భూమిక ఫైటర్ పై సీరియస్ అయిందని తెలిపారు.

Telugu Bhumika, Bhumika Scolded, Figher, Okkadu, Raju, Tollywood-Movie

భూమిక ఇంగ్లీష్ లో తిట్టిందని ఏం తిట్టిందో కూడా తెలియదని ఇంగ్లీష్ లో భయంకరంగా తిట్టిందని ఎం.ఎస్.రాజు తెలిపారు.ఈ విషయం తెలిసి భూమిక ఫైటర్ విషయంలో అంత దారుణంగా ప్రవర్తించారా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.భూమికకు ప్రస్తుతం తెలుగులో కూడా ఎక్కువగా ఆఫర్లు రావడం లేదనే సంగతి తెలిసిందే.

అయితే భూమికకు ప్రేక్షకుల్లో క్రేజ్ మాత్రం బాగానే ఉంది.

Telugu Bhumika, Bhumika Scolded, Figher, Okkadu, Raju, Tollywood-Movie

భూమిక కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.భూమిక ఆ ఫైటర్ పై ఎందుకు సీరియస్ అయ్యారనే ప్రశ్నకు సైతం సమాధానం దొరకాల్సి ఉంది.భూమిక భవిష్యత్తులో ఒక్కడు షూటింగ్ సమయంలో అసలేం జరిగిందో ఆమె ఎందుకు ఆ విధంగా ప్రవర్తించారో వెల్లడిస్తారేమో చూడాల్సి ఉంది.

తెలుగు ప్రేక్షకుల్లో భూమికను అభిమానించే అభిమానుల సంఖ్య ఎక్కువగానే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube