బాలయ్య క్షమాపణలు చెప్పాల్సిందే... డిమాండ్ చేస్తున్న అక్కినేని ఫ్యాన్స్!

నందమూరి నట సింహం బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా అక్కినేని ఫ్యామిలీ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం తీవ్ర వివాదాలకు కారణం అవుతున్నాయి.అక్కినేని నాగేశ్వరరావు వర్ధంతి రోజున ఈయన అక్కినేని తొక్కినేని అంటూ చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై అక్కినేని అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

 Balayya Should Apologize Akkinenis Fans Are Demanding, Balayya, Apologize, Akkin-TeluguStop.com

ఇక ఇప్పటికే బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలపై అఖిల్ నాగచైతన్య స్పందించారు.

Telugu Akhil, Akkineni, Akkinenifans, Apologize, Balakrishna, Balayya, Naga Chai

ఇక బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సర్వేశ్వరరావు స్పందిస్తూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.గతంలో బాలకృష్ణ ఏఎన్ఆర్ గారిని ఉద్దేశిస్తూ తన బాబాయి లాంటివారని ఎన్నో సార్లు చెప్పారని గుర్తు చేశారు.ఇలా సీనియర్ హీరోల గురించి బాలయ్య వేదికపై జోక్ చేస్తూ మాట్లాడాలనుకోవడం పూర్తిగా తప్పని సర్వేశ్వరరావు పేర్కొన్నారు.

ఇక అక్కినేని నాగేశ్వరరావు వర్ధంతి రోజు సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని పెట్టుకొని ఆయన ఫ్యామిలీని కించపరుస్తూ మాట్లాడటం పూర్తిగా తప్పని సర్వేశ్వరరావు పేర్కొన్నారు.

Telugu Akhil, Akkineni, Akkinenifans, Apologize, Balakrishna, Balayya, Naga Chai

ఇలా అక్కినేని ఫ్యామిలీ గురించి విమర్శిస్తూ మాట్లాడటం కన్నా రెండు నిమిషాల పాటు మౌనం పాటించి ఆయనకు నివాళులు అర్పించి ఉంటే బాగుండేదని ఈయన పేర్కొన్నారు.గతంలో ఎన్టీఆర్ గారి గురించి నాగార్జున ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడలేదనీ సర్వేశ్వరరావు గుర్తు చేసుకున్నారు.ఇలా బాలకృష్ణ అక్కినేని ఫ్యామిలీ గురించి చేసినటువంటి ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని తాను క్షమాపణలు చెప్పాలంటూ అక్కినేని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

అలాగే బాలయ్య ఈ వ్యాఖ్యలపై వివరణ కూడా ఇవ్వాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.మరి ఈ విషయంలో బాలయ్య ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube