బాలయ్య, అనీల్ రావిపూడి కాంబో మూవీ హీరోయిన్‌ పై ఇంట్రెస్టింగ్‌ పుకారు

బాలకృష్ణ హీరో గా అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.వీర సింహా రెడ్డి సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యం లో ఈ సినిమా పై అంచనాలు భారీ గా ఉన్నాయి.

 Heroine In Balakrishna And Anil Ravipudi Movie , Anil Ravipudi , Balakrishna, To-TeluguStop.com

బాలకృష్ణ తో ఒక విభిన్నమైన యాక్షన్ సినిమా ను తెరకెక్కించబోతున్నట్లుగా దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పటికే ప్రకటించాడు.వీర సింహా రెడ్డి సినిమా విడుదలకు ముందే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండవ షెడ్యూల్ అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.

Telugu Anil Ravipudi, Balakrishna, Honey Rose, Kajal Agarwal, Nayanthara, Tollyw

రెండవ షెడ్యూల్ ప్రారంభానికి ముందే హీరోయిన్ విషయం లో ఒక నిర్ణయానికి రావాలని దర్శకుడు అనిల్ రావిపూడి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారట.వీర సింహా రెడ్డి సినిమా లో బాలకృష్ణ జోడి గా నటించిన హనీ రోజ్ ని ఈ సినిమా లో హీరోయిన్ గా నటింపజేస్తున్నట్లుగా కూడా ప్రచారం జరిగింది.

Telugu Anil Ravipudi, Balakrishna, Honey Rose, Kajal Agarwal, Nayanthara, Tollyw

అంతే కాకుండా కాజల్ అగర్వాల్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది.మరో వైపు నయనతార పేరు ను కూడా దర్శకుడు పరిశీలిస్తున్నాడని ప్రచారం జరిగింది.ఇన్ని పేర్ల ను దర్శకుడు అనిల్ రావిపూడి పరిశీలిస్తున్న నేపథ్యం లో ఎవరు బాలకృష్ణ కు జోడి గా ఓకే చెప్తారు అనేది చూడాలి.గతం లో ఒకటి రెండు సార్లు బాలకృష్ణ కు జోడి గా నటించేందుకు కాజల్ అగర్వాల్ నో చెప్పింది.

మరి ఈ సారి ఆమె బాలకృష్ణ సినిమా కు ఓకే చెప్పబోతుందా అనేది చూడాలి.అంతే కాకుండా వీర సింహా రెడ్డి సినిమా లో ఆకట్టుకున్న హనీ రోజ్ కూడా బాలయ్య కు మంచి జోడి అన్నట్లుగా నిలిచింది.

అందుకే ఆమె ఈ సినిమా లో నటించిన కూడా ఖచ్చితం గా మంచి టాక్ దక్కే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.అనిల్ రావిపూడి నిర్ణయం ఎప్పుడు తీసుకుంటాడా అని అంతా ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube