బింబిసారా 2 లో ఎన్.టి.ఆర్ మాత్రమే కాదు బాలకృష్ణ కూడా..!

కల్యాణ్ రామ్ హీరోగా వశిష్ట డైరక్షన్ లో చారిత్రక కథతో వస్తున్న సినిమా బింబిసార.రీసెంట్ గా వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.

 Balakrishna In Kalyan Ram Bimbisara 2 Details, Bimbisara 2, Akhanda, Balayya, Ba-TeluguStop.com

ఇక ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ లో కల్యాణ్ రామ్ బింబిసారా సీక్వల్స్ ఉంటాయని చెప్పారు.అంతేకాదు బింబిసార 2లో అన్ని కుదిరితే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కూడా ఉంటారని చెప్పారు.బింబిసార సక్సెస్ అయితే బింబిసార 2 ఉంటుంది.అయితే ఈ సెకండ్ పార్ట్ లో కేవలం తారక్ మాత్రమే కాదు నందమూరి నట సింహం బాలయ్యని కూడా పెట్టాలని ప్రయత్నిస్తున్నారట.

ఆల్రెడీ ఎన్.టి.ఆర్ జీవిత కథతో తెరకెక్కిన మహానాయకుడు సినిమాలో హరికృష్ణ పాత్రలో కల్యాణ్ రామ్ నటించారు.ఇప్పుడు కల్యాణ్ రామ్ బింబిసార సీక్వల్ లో బాలకృష్ణ కల్యాణ్ రామ్ తో కలిసి నటిస్తారని అంటున్నారు.

అంతేకాదు చాలా రోజుల నుంచి నందమూరి మల్టీస్టారర్ గురించి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.అది బింబిసారతో తీర్చాలని చూస్తున్నారు కల్యాణ్ రామ్.

Telugu Akhanda, Balakrishna, Balayya, Bimbisara, Ntr, Kalyan Ram, Nandamuri, Tol

బింబిసార మూవీకి వచ్చిన రెస్పాన్స్ ని బట్టి బింబిసార 2 మరింత భారీగా ప్లాన్ చేస్తారట.ఈ క్రమంలో కథలో కొన్ని మార్పులు చేసి తారక్ తో పాటుగా బాలకృష్ణ పాత్రని ఇంట్రడ్యూస్ చేయాలని చూస్తున్నారట.బాలకృష్ణ, ఎన్.టి.ఆర్, కల్యాణ్ రామ్ ఈ ముగ్గురు స్క్రీన్ మీద కనిపిస్తే నందమూరి ఫ్యాన్స్ కి అంతకన్నా మరొకటి ఉండదు.బింబిసార మూవీతో ఆ కల నెరవేర్చాలని చూస్తున్నారట.

ఎక్కువసేపు కాకపోయినా బింబిసార 2లో బాలయ్య జస్ట్ కెమియో రోల్ అయినా చేసే అవకాశం ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్.మొత్తానికి నందమూరి ఫ్యాన్స్ కోరిక త్వరలో నెరవేరుతుందని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube