చిరంజీవి, బాలయ్య ఇండస్ట్రీని ఆదుకోవాలా.. వాళ్లు మాత్రమే దిక్కు అంటూ?

2022 సంవత్సరం ఫస్ట్ హాఫ్ లో విడుదలైన సినిమాలలో ఎక్కువ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కిన సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకున్నాయి.2022 సంవత్సరం సెకండాఫ్ లో చిన్న సినిమాలు ఎక్కువగా విడుదలవుతూ ఉండటం గమనార్హం.అయితే చిరంజీవి, బాలయ్య మాత్రమే సెకండాఫ్ లో ఇండస్ట్రీని ఆదుకోవాలంటూ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

 Industry Depends On Chiranjeevi And Balakrishna Details, Balakrishna, Chiranjeev-TeluguStop.com

ఈ ఏడాది సెకండాఫ్ లో రిలీజయ్యే పెద్ద సినిమాలలో మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఒకటి కాగా బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న జై బాలయ్య ఒకటి కావడం గమనార్హం.ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవాలని అటు చిరంజీవి అభిమానులు ఇటు బాలయ్య అభిమానులు కోరుకుంటున్నారు.

మిగతా హీరోల సినిమాలు విడుదలవుతున్నా అవి ఈ రేంజ్ సినిమాలు కావు.

చిరంజీవి సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా బాలయ్య సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు.

Telugu Balakrishna, Chiranjeevi, Mohan Raja, God, Jai Balayya, Tollywood-Movie

ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతుండటం గమనార్హం.ఈ సినిమాలు సక్సెస్ ను సొంతం చేసుకుంటే చిరంజీవి, బాలయ్యల మార్కెట్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది.ఈ సినిమాలతో చిరంజీవి, బాలయ్య సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Telugu Balakrishna, Chiranjeevi, Mohan Raja, God, Jai Balayya, Tollywood-Movie

చిరంజీవి, బాలయ్య సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.వయస్సు పెరుగుతున్నా ఈ స్టార్ హీరోలలో ఉత్సాహం ఏ మాత్రం తగ్గడం లేదు.రీఎంట్రీలో చిరంజీవి వేగంగా సినిమాలలో నటిస్తుండటం గమనార్హం.

చిరంజీవి, బాలయ్యలకు సినిమాసినిమాకు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.చిరంజీవి, బాలకృష్ణ వచ్చే ఏడాది కూడా తమ సినిమాలు రిలీజయ్యేలా ప్లాన్ చేసుకున్నారు.

చిరంజీవి, బాలకృష్ణ రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద పోటీ పడే అవకాశాలు కూడా ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube