ఉస్తాద్ రామ్, లింగుసామి కాంబోలో వచ్చిన ది వారియర్ సినిమా ఆశించిన స్థాయిలో లేకపోవడం రామ్ ఫ్యాన్స్ ని అప్సెట్ అయ్యేలా చేసింది.రామ్ ఎనర్జీకి తగిన సినిమా కాదని.
రొటీన్ కథతో ఈ సినిమా తీశాడని లింగుసామిని కామెంట్స్ చేస్తున్నారు.అయినా సరే చాలావరకు రామ్ ఈ సినిమాలో హైలెట్ గా నటించాడని.
తన టాలెంట్ మొత్తం చూపించి సినిమాని నిలబెట్టాడని అంటున్నారు.అయితే కథలో సత్తా లేకుండా హీరో ఎంత బాగా నటించినా సరే పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు.
అందుకే రామ్ ఫ్యాన్స్ ఈ విషయంలో నిరాశగా ఉన్నారు.
అయితే వారు లింగుసామి ఎలాగు తమని మెప్పించలేదు కనీసం బోయపాటి శ్రీను సినిమా అయినా వారి అంచనాలకు తగినట్టుగా ఉండాలని కోరుతున్నారు.
బోయపాటి శ్రీను సినిమా అంటే మాస్ మసాలా మూవీ అని తెలిసిందే.రామ్ కి మంచి మాస్ ఫాలోయింగ్ ఉంటుంది.ఆ మాస్ ఆడియెన్స్ మెప్పు పొందితే మాత్రం రామ్ ఖాతాలో హిట్ పడినట్టే లెక్క.అఖండ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బోయపాటి తన నెక్స్ట్ సినిమా రామ్ తో ఫిక్స్ అయ్యాడు.
ఈ సినిమా తప్పకుండా ఆశించిన స్థాయికి మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
బోయపాటి సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్, మాస్ ఎలివేషన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.ఇన్నాళ్లు తన మార్క్ సినిమాలతో అలరిస్తూ వచ్చిన రామ్ కెరియర్ లో మొదటిసారి స్టార్ డైరక్టర్ తో పనిచేస్తున్నాడని చెప్పొచ్చు.బోయపాటి తో రామ్ మూవీ బాక్సులు బద్ధలవ్వాల్సిందే అంటున్నారు.
ద్ వారియర్ జస్ట్ ఓకే అనిపించుకోగా బోయపాటి శ్రీను సినిమాతో సత్తా చాటాలని చూస్తున్నారు.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది.
సినిమాలో మిగతా స్టార్ కాస్ట్ ఎవరన్నది తెలియాల్సి ఉంది.