'బలగం' వేణు తర్వాత సినిమా గురించి మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదు

కమెడియన్ గా రెండు దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న వేణు( Venu ) రాజాగా బలగం( Balagam ) చిత్రం తో దర్శకుడి గా పరిచయం అయిన విషయం తెలిసిందే.దిల్ రాజు( Dil Raju ) నిర్మించిన బలగం చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

 Balagam Movie Director Venu Next Film Update , Balagam Movie , Dil Raju, Venu, F-TeluguStop.com

ఈ మధ్య కాలం లో థియేటర్ల కు ఊర్ల కు ఊర్లు తరలి వెళ్లడం.గ్రామాల్లో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేయడం ఏ సినిమా కు జరగలేదు.

కేవలం బలగం సినిమా కు మాత్రమే ఆ అరుదైన అవకాశం గౌరవం దక్కింది.అలాంటి అద్భుతమైన సినిమా ని ఆవిష్కరించిన దర్శకుడు వేణు తదుపరి సినిమా విషయం లో రకరకాల పుకార్లు సోషల్ మీడియా లో షికార్లు చేస్తున్నాయి.

ఆయన తదుపరి సినిమా భారీగా ఉంటుందని కొందరు లేదు నార్మల్గానే ఉంటుందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆయన తో సినిమా లు నిర్మించేందుకు పలువురు ప్రముఖ నిర్మాతలు అడ్వాన్స్ పట్టుకొని చక్కర్లు కొడుతున్నారట.మరో వైపు ఆయన మాత్రం దిల్ రాజు బ్యానర్ లోనే తదుపరి సినిమా ను చేసేందుకు ఓకే చెప్పాడు అని సమాచారం అందుతుంది.మొత్తానికి దిల్ రాజు బ్యానర్ లో వేణు దర్శకత్వం లో మరో సినిమా ఉంటుందని తెలుస్తోంది.

అది ఎప్పుడు ఉంటుంది ఎలా ఉంటుంది అనేది మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు.దిల్ రాజు బ్యానర్ లోనే వేణు తదుపరి సినిమా ఉంటే కచ్చితంగా అది కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటున్నారు.

దిల్ రాజు మంచి కథ లను ఎంపిక చేసుకుని సినిమాలను నిర్మించడం లో ముందు ఉంటాడు.అందుకే వీళ్ల కాంబో లో మరో మంచి సినిమా వస్తుందని ప్రేక్షకులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు చాలా నమ్మకంగా ఉన్నారు.

అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా దిల్ రాజు, వేణు తదుపరి సినిమా ఉంటుందేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube