పదేళ్ల తర్వాత మరోసారి ఆ హీరోతో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నయనతార?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార( Nayanatara) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.సౌత్ ఇండస్ట్రీలో గత రెండు దశాబ్దాలుగా వరుస సినిమాలలో నటిస్తూ అగ్రతారగా ఓ వెలుగు వెలుగుతున్న ఈమె అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోయిన్గా కూడా పేరు సంపాదించుకున్నారు.

 After Ten Years Nayanthara Gave The Green Signal To The Film With That Hero Once-TeluguStop.com

ఇక పెళ్లి తర్వాత కూడా నయనతార తగ్గేదే అనే విధంగా సినిమాలను చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ తో కలిసి జవాన్( Jawan) అనే సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమాతో పాటు తాజాగా ఈమె మరో సినిమా పూజ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని షూటింగ్లో బిజీ అవుతున్నారు.

నయనతార తన 75వ సినిమాగా నీలేష్ కృష్ణ దర్శకత్వంలోమరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈ సినిమా తాజాగా పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులను ప్రారంభించింది.ఈ క్రమంలోనే చిత్ర బృందం నయనతారకు గ్రాండ్ వెల్కమ్ చెబుతూ ఒక వీడియోని షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ సినిమాలో హీరో జై( Jai ) నటిస్తున్నారు.దాదాపు పది సంవత్సరాల తర్వాత తిరిగిన యనతార ఈ హీరోతో కలిసి మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.

నయనతార జై ఇది వరకు రాజారాణి ( Raja Rani ) సినిమాలో కలిసిన నటించిన విషయం మనకు తెలిసిందే.రాజా రాణి సినిమా ద్వారా తమ నటనతో ఎంతగానో ఆకట్టుకున్నటువంటి ఈ జోడి తిరిగి పది సంవత్సరాలు తర్వాత మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఇక ఈ సినిమా వీలైనంత త్వరగా షూటింగ్ పనులను పూర్తి చేసుకొని ఈ ఏడాది చివరికి విడుదల చేయాలన్న ఉద్దేశంతో దర్శక నిర్మాతలు శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ఇటీవలే నయన్‌ నటించిన కనెక్ట్‌ ఘోరంగా డిజాస్టర్‌ అయింది.తెలుగులో అదే పేరుతో యువీ క్రియేషన్స్‌ వారు విడుదల చేయగా ఈ సినిమా తెలుగులో కూడా ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్(Connect) కాలేకపోయిందని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube