కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరిని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కలిశారు.ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వంపై కేంద్రమంత్రికి ఆయన ఫిర్యాదు చేశారు.
ఏపీకి పెద్ద ఎత్తున కేంద్రం ఇళ్లు కేటాయించిందన్నారు.
కేంద్రం కేటాయించిన ఇళ్ల నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని సోము వీర్రాజు ఆరోపించారు.
ఈ మేరకు ఏపీలో పర్యటించి ఇళ్ల నిర్మాణాలను పరిశీలించాలని కోరినట్లు తెలిపారు.దీంతో త్వరలోనే ఏపీలో పర్యటిస్తామని హర్దీప్ సింగ్ పూరి హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
వైసీపీ కలర్లు వేస్తూ వైసీపీ ఇళ్లుగా మార్చేశారన్న సోము వీర్రాజు జగనన్న కాలనీ మోదీ అన్న ఇల్లు అని పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా రేపు కేంద్ర జలశక్తి, పంచాయతీ శాఖ మంత్రులను కలవనున్నట్లు వెల్లడించారు.







