ఆర్‌ మల్టీస్టారర్‌లో శివగామి.. రాజమౌళి సన్నిహితులేమన్నారంటే!  

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్‌ మూవీ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’. ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకుని, మొదటి షెడ్యూల్‌ కూడా ప్రారంభం అయిన విషయం తెల్సిందే. ఇక ఈ చిత్రంలో హీరోయిన్స్‌ ఎవరు, ఇతర ముఖ్య పాత్రల్లో ఎవరు కనిపించబోతున్నారు అంటూ రకరకాలుగా సినీ వర్గాల్లో ప్రేక్షకుల్లో చర్చ జరుగుతుంది. ఈ సమయంలోనే మీడియాలో రకరకాలుగా వార్తలు పుట్టుకు వస్తున్నాయి. తాజాగా ఆర్‌ మల్టీస్టారర్‌లో హీరోయిన్స్‌ పాత్రకు వారు వీరు ఎంపిక అయ్యారు అంటూ వార్తలు వచ్చాయి. కాని అవేవి కూడా నిజం కాదని తేలిపోయింది. తాజాగా ఈ చిత్రంలోని ఒక కీలక పాత్ర కోసం రమ్యకృష్ణను జక్కన్న ఎంపిక చేశాడంటూ మరో వార్త ఒకటి వస్తోంది.

Baahubali Sivagami In Rajamoulis RRR-Jr Ntr Rajamoulis Rrr Ram Charan Rrr Shivagami

Baahubali Sivagami In Rajamoulis RRR

రాజమౌళి గత చిత్రం ‘బాహుబలి’ లో రమ్యకృష్ణ పోషించిన పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శివగామి పాత్రకు హైలైట్‌గా నిలివడంతో పాటు సినిమాకే ప్లస్‌ అయ్యింది. అద్బుతమైన రెస్పాన్స్‌ దక్కించుకున్న రమ్యకృష్ణను మరోసారి తన సినిమాలో నటింపజేసేందుకు రాజమౌళి నిర్ణయించుకున్నాడట. శివగామి పాత్ర తరహాలోనే ఈ చిత్రంలో కూడా చాలా పవర్‌ ఫుల్‌ లేడీ పాత్రలో రమ్యకృష్ణ కనిపించబోతుంది అనేది ఆ వార్త సారాంశం.

Baahubali Sivagami In Rajamoulis RRR-Jr Ntr Rajamoulis Rrr Ram Charan Rrr Shivagami

మీడియాలో వస్తున్న వార్తలపై రాజమౌళి సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు రమ్యకృష్ణను ఈ చిత్రంలోకి తీసుకునే ఆలోచనే చేయలేదు. ఎందుకంటే ఆమెకు తగ్గ పాత్ర ఈ చిత్రంలో లేదని చెబుతున్నారు. రాజమౌళి ఇప్పటి వరకు ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ పాత్రలు మినహా మరే పాత్రను కూడా రివీల్‌ చేయలేదు. అందుకే ఈ పాత్రను కూడా రివీల్‌ చేయకుండా ఉండాలని భావిస్తున్నాడంటూ మరి కొందరు భావిస్తున్నారు. మొత్తానికి రమ్యకృష్ణకు మరోసారి జక్కన్న ఛాన్స్‌ ఇచ్చాడా లేదా అనే విషయంపై క్లారిటీ రావాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.