ఎగ్జిట్ పోల్స్ ను తారుమారు చేస్తూ అధికార పార్టీ ఘన విజయం

ఆస్ట్రేలియా లో ఎగ్జిట్ పోల్స్ తారుమారు అయ్యాయి.విపక్ష పార్టీ లేబర్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది అని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయగా ఇప్పుడు ఆ అంచనాలను తారుమారు చేస్తూ లిబరల్ కూటమి అనూహ్య విజయం సాధించింది.

 Australia Election Morrison Claims Victory In Miracle Win-TeluguStop.com

శనివారం నాటి పోలింగ్ లో ఈ కూటమి గరిష్ట సంఖ్య లో సీట్లను గెల్చుకొని,కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా సాగుతుంది.దీనితో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ కొత్త ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు.

151 సీట్లు ఉన్న ప్రతినిధుల సభ లో ప్రభుత్వ ఏర్పాటుకు 76 సీట్లు అవసరమవ్వగా, అయితే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ప్రతిపక్ష లేబర్ పార్టీ కి 82 సీట్లు వస్తాయని అంచనా వేసాయి.అయితే ఆ అంచనాలను పటా పంచలు చేస్తూ అధికార కూటమి 74 స్థానాల్లో ఘన విజయం సాధించగా,విపక్ష పార్టీ కి 65 స్థానాలు మాత్రమే దక్కాయి.

దీనితో ఓటమి ని అంగీకరించిన బిల్ షార్టైన్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube