జ్యోతిష్య రాజకీయాలు.. నిజమౌతాయా మరి !

ఎన్నికలు దగ్గర పడే కొద్ది సర్వేలు, విశ్లేషణలు, జ్యోతిష్యాలు.ఇలా ప్రతిదీ కూడా రాజకీయ నాయకులను కలవర పెడుతూనే ఉంటాయి.

 Astrologer Rudra Karan Partaap Comments On Next Elections Telangana And Ap, As-TeluguStop.com

ఎందుకంటే ప్రజాభిప్రాయాలను అంచనా వేయడంలో సర్వేలు, విశ్లేషణలు కొంత పాత్ర పోషిస్తూ ఉంటాయి.కొన్ని సందర్భాల్లో సర్వేలు, ఇచ్చిన ఫలితలే ప్రజాభిప్రాయంగా రుజువౌతూ ఉంటుంది.

ఇదిలా ఉంచితే జ్యోతిష్యాల ప్రస్తావన మరోలా ఉంటుంది.జ్యోతిష్యాలు ఊహాజనితమే అయినప్పటికి రాజకీయ నాయకులు వీటిని గట్టిగా నమ్ముతూ ఉంటారు.

ఎన్నికల్లో వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయనేది జ్యోతిష్యం ద్వారా ఓ అంచనాకు వస్తూ ఉంటారు.

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ జ్యోతిష్యాలకు సంబంధించిన వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.ప్రముఖ ఆస్ట్రాలజర్ రుద్ర కరణ్ పర్తాప్ ( Rudra karan partaap )ట్విట్టర్ లో రెండు తెలుగు రాష్ట్రాలకు ఎన్నికల ఫలితాలను ముందే చెప్తూ ట్విట్స్ చేశారు.ఏపీలో వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ గెలుస్తుందని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా మరోసారి బాద్యతలు చేపడతారని చెప్పుకొచ్చారు.

అలాగే తెలంగాణలో కూడా బి‌ఆర్‌ఎస్ గెలుస్తుందని, కే‌సి‌ఆర్ మూడో సారి సి‌ఎం పదవి చేపడతారని ట్విట్స్ చేశారు.ఈయన కర్నాటక ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ గెలుస్తుందని గెలుస్తుందని చెప్పుకొచ్చారు.

ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో ప్రస్తుతం ఆయన రెండు తెలుగు రాష్ట్రాలపై చేసిన ట్విట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

మరి ఈయన జోష్యం చెప్పినట్లుగా ఏపీలో వైసీపీ, తెలంగాణలో బి‌ఆర్‌ఎస్ ( BRS PARTY )అధికారంలోకి వస్తాయా లేదా అనేది చూడాలి.ప్రస్తుతం ఏపీలో వైసీపీ పై ప్రజావ్యతిరేకత మెండుగా కనిపిస్తోందనేది కొందరి విశ్లేషకుల మాట.దానికి ఆ మద్య జరిగిన పట్టభధ్రుల ఎన్నికలే నిదర్శనంగా చెబుతున్నారు విశ్లేషకులు.అంతే కాకుండా జగన్ పాలన వైఖరి పై కూడా చాలమంది పెదవి విరుస్తున్నారు.ఈ నేపథ్యంలో జగన్ కు వచ్చే ఎన్నికల్లో గెలుపు అసాధ్యం అనేది రాజకీయ అతివాదుల మాట.ఇకపోతే తెలంగాణలో బి‌ఆర్‌ఎస్ కు మంచి ప్రజాధరణ ఉన్నప్పటికి, బీజేపీ కాంగ్రెస్ పార్టీల నుంచి గట్టి పోటీ ఉంది.దాంతో బి‌ఆర్‌ఎస్ కు గెలుపు అంత సులువేం కాదనేది కొందరి మాట.మరి జ్యోతిష్యులు చెప్పిన మాటలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube