దుబాయ్ లో ఏపీ రాజకీయం మాములుగా లేదు కదా

ఏపీ రాజకీయాల్లో దుబాయ్ రాజకీయ కాక పుట్టిస్తోంది.రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కుమారుడి నిశ్చితార్ధ వేడుకుల కోసం భారీగా ఖర్చు చేయడమే కాకుండా సుమారు 700 మంది వీఐపీల కోసం 15 ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయడం తెలంగాణ, ఏపీలో ఉన్న రాజకీయ ప్రముఖలను దుబాయ్ లో సందడి చేయడం జరిగిపోయాయి.

 Ap Politics In Dubai-TeluguStop.com

అయితే ఇక్కడ నిశ్చితార్ధ సందడి కంటే రాజకీయ సందడే ఎక్కువ కనిపించిందట.రాజకీయ సమీకరణాలకు కూడా ఇది వేదికగా మారడం చర్చనీయాంశం అయ్యింది.

ఇప్పుడు ఈ సందడి మీదే చర్చంతా జరుగుతోంది.కేవలం నిశ్చితార్ధ వేడుకల కోసం సీఎం రమేష్ భారీగా ఖర్చు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ఈ కార్యక్రమానికి ఏపీ, తెలంగాణ ప్రాంతాలకు చెందిన కీలక నాయకులంతా హాజరయ్యారు.అయితే ఈ నిశ్చితార్థం వేడుక రాజకీయాలకు వేదికగా మారిందట.

అదే ఇప్పడు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

Telugu Ap Dubai, Cm Ramesh Son, Cmramesh, Tdpmlas, Ycpmp-

టీడీపీకి చెందిన అనేకమంది ఎమ్మెల్యేలు, వైసీపీ ఎంపీలు బీజేపీతో టచ్‌లో ఉన్నారన్నట్టుగా రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి సంచలన విషయం బయటపెట్టడంతో దుబాయ్‌ ఎంగేజ్‌మెంట్‌ వేడుక రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చకు దారితీస్తోంది.సీపీఐ జాతీయ నేత నారాయణ కూడా, దుబాయ్ వేదికగా వలసల రాజకీయానికి శ్రీకారం చుట్టారని వ్యాఖ్యానించారు.దుబాయ్‌లో సీఎం రమేష్ కుమారుడు రిత్విక్ నిశ్చితార్థానికి ఎవరెవరు వెళ్లారన్నదానిపై స్పష్టమైన సమాచారం లేకపోయినా, పలువురు వైసీపీ ఎంపీలతో పాటు, టీడీపీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులకు ఆహ్వానాలు అందడం వారు వెళ్లడం జరిగిపోయాయి.

ప్రస్తుతం టీడీపీలో 23మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.వీరిలో దాదాపుగా 11మంది టీడీపీ ఎమ్మెల్యేలు దుబాయ్‌లో బీజేపీ భేటీ అయ్యి తమ రాజకీయ భవిష్యత్తు గురించి చర్చించినట్టు సమాచారం.

Telugu Ap Dubai, Cm Ramesh Son, Cmramesh, Tdpmlas, Ycpmp-

పార్టీ మారబోతున్న ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న గంటా శ్రీనివాస రావు అందరికంటే కాస్త ముందుగానే దుబాయ్ ఫ్లయిట్ ఎక్కేసారట.అక్కడ బీజేపీ కీలక నాయకులతో పార్టీ మారే విషయమై చర్చించినట్టు తెలుస్తోంది.తాను ఎమ్యెల్యేలను తీసుకొస్తానని ప్రతిఫలంగా తనకు దక్కబోయే ప్రయారిటీ ఏంటి అంటూ ఆయన బీజేపీ పెద్దలతో మంతనాలు చేసినట్టు తెలుస్తోంది.బీజేపీలో చేరబోయే టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరెవరు ? వారు వస్తే న్యాయపరంగా ఎదురయ్యే చిక్కుముడులను ఏ విధంగా ఎదుర్కోవాలి అనే విషయమై అక్కడ చర్చించినట్టుగా సమాచారం.

Telugu Ap Dubai, Cm Ramesh Son, Cmramesh, Tdpmlas, Ycpmp-

ఏలూరు వైసీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్‌ దుబాయ్‌ వెళ్లారని తెలుస్తోంది.అలాగే ఇంకొందరు ఎంపీలు సైతం వెళ్లారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.అయితే టీడీపీ అయినా, వైసీపీ అయినా, ఎంగేజ్‌మెంట్‌కు వెళ్లినవారు ఎవరైనా పార్టీ మారే సమీకరణల కోసమే వెళ్లారని విషయం ఖచ్చితంగా చెప్పలేము.దీనికి కారణం సీఎం రమేష్‌తో చాలామంది నాయకులకు సన్నిహిత సంబంధాలున్నాయి.

కానీ పార్టీ మార్పుల విషయమై ఏపీలో హాట్ టాఫిక్ నడుస్తున్న నేపథ్యంలో వీరంతా దుబాయ్ నిశ్చితార్ధ వేడుకను తమకు అనుకూలంగా మార్చుకున్నట్టు కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube