రండి మాట్లాడుకుందాం ! పలువురు ఎమ్మెల్యేలకు జగన్ పిలుపు 

ఏపీ అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలకు రోజురోజుకు టెన్షన్ పెరిగిపోతుంది.వచ్చే ఎన్నికల్లో టికెట్ల విషయంలో జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం, పెద్ద ఎత్తున మార్పులకు శ్రీకారం చుట్టడంతో, ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే సీటు గల్లంతు అవుతుందో అనే టెన్షన్ ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో నెలకొంది.

 Ap Government, Jagan, Ysrcp, Ap Cm Jagan, Tdp, Janasena, Bjp, Ap Elections, Ysrc-TeluguStop.com

ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో మార్పు చేర్పులు చేపట్టగా, దాదాపు 65 నియోజకవర్గాల్లో మార్పులకు జగన్ శ్రీకారం చుట్టుబోతున్నారనే వార్త ఆ పార్టీ ఎమ్మెల్యేలకు టెన్షన్ పుట్టిస్తుంది.ఇది ఇలా ఉంటే రెండో విడత ఇన్చార్జిల మార్పుకు సంబంధించిన జాబితాను విడుదల చేసేందుకు జగన్ కసరత్తు చేస్తున్నారు.

సర్వే నివేదిక ఆధారంగా ఈ మార్కులకు జగన్ శ్రీకారం చుట్టారు.జనవరి రెండో తేదీన రెండో విడత జాబితా విడుదల చేయనున్నట్లు విశ్వసినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

రీజనల్ కోఆర్డినేటర్లు ,ఎమ్మెల్యేలతో మరోసారి చర్చించి తొలి జాబితా రూపొందించాలని జగన్ భావిస్తున్నారట.దీనిలో భాగంగానే ఈరోజు పలువురు రీజనల్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలను తాడేపల్లి రావలసిందిగా జగన్ నుంచి పిలుపు వెళ్లినట్లు సమాచారం.

ఈ రోజు రీజినల్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలతో జగన్ విడివిడిగా సమావేశం నిర్వహించి, సమాచారాన్ని సేకరించనున్నారట.ఆ తర్వత తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో మార్పు చేర్పులు చేపట్టారు.మిగతా స్థానాల్లోనూ మార్పు చేర్పులకు శ్రీకారం చుట్ట బోతున్నారు.

కొంతమందిని వేరేచోటకి పంపి, మరికొంతమందికి సీటు ఇవ్వకుండా కొత్తవారికి అవకాశం ఇవ్వబోతున్నారు.

Telugu Ap Cm Jagan, Ap, Jagan, Janasena, Ysrcp, Ysrcp Mlas, Ysrcpreginol-Politic

.దాదాపు 50 నుంచి 60 స్థానాల్లో ఈ మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు వైసిపి వర్గాలు పేర్కొంటున్నాయి.ఈరోజు ఎమ్మెల్యేలు, రీజనల్ కోఆర్డినేటర్లతో జరిగి సమావేశంలో సీటు ఇవ్వని వారికి జగన్ నేరుగా ఆ విషయాన్ని చెప్పి, పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత సముచిత స్థానం కల్పిస్తామని, టికెట్ రాలేదనే అసంతృప్తితో ఎటువంటి తొందరపాటు చర్యలకు దిగవద్దని, నచ్చచెప్పబోతున్నారట.

దీంతో ఈ రోజు సమావేశానికి హాజరు కాబోతున్న ఎమ్మెల్యేలలో టెన్షన్ నెలకొందట.తమకు సీటు ఉంటుందా లేదా అనేది క్లారిటీ లేక పలువురు పార్టీలోని కీలక నేతలను ఆరా తీస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube