ఏపీ ప్రజలకు శుభవార్త.. కరోనా కోసం ప్రత్యేక యాప్...!

కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్ లో ఎలా విలయతాండవం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రోజుకు వేలల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి.

 Ap Government, Mobile App, Coronavirus Information, Covid-19 Andhra Pradesh-TeluguStop.com

గత వారం రోజులుగా రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి.కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఇప్పటికే పలు నగరాలు స్వచ్చందంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి.

ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది.భారీ సంఖ్యలో కరోనా నిర్దారణ పరీక్షలు చేస్తుంది.ఇంకా కరోనా వైరస్ రాకుండా ఉండేందుకు ఎం చెయ్యాలి? వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎవరిని సంప్రదించాలి ? ఎలాంటి మందులు వాడాలి అనేది ప్రజలకు తెలియాలని ప్రతీ చోటా హోర్డింగ్స్ పెట్టాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించిన సంగతి విదితమే.

ఇకపోతే కోవిడ్-19 కి సంబంధించి అవగాహనా పెంచాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేతు అనే యాప్ ని క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇంకా ఈ నేపథ్యంలోనే కోవిడ్ 19 ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో ఓ అప్లికేషన్‌ను జగన్ సర్కార్ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది.కరోనాపై అవగాహన కలిగేలా ప్రజలకు అవసరమైన సూచనలు ఇందులో ఇస్తారు.ఈ లింక్ https://bit.ly/30fvmbm సహాయంతో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.మరి ఇంకేందుకు ఆలస్యం వెంటనే యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube