ఏపీ ఎక్సైజ్ పాలసీ మరో ఏడాది పాటు పొడిగింపు

ఏపీ ఎక్సైజ్ పాలసీని మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు 2022 -23 రిటైల్ మద్యం విక్రయాల విధానం అమలుకు నోటిఫికేషన్ జారీ చేసింది.

 Ap Excise Policy Extended For Another Year-TeluguStop.com

రాష్ట్రవ్యాప్తంగా 2,934 రిటైల్ దుకాణాల్లో మద్యం విక్రయాలకు అనుమతినిచ్చింది.భారత్ లో తయారైన విదేశీ మద్యం విక్రయాలకు సైతం అనుమతి ఇచ్చినట్లు పేర్కొంది.

అదేవిధంగా మద్య నియంత్రణ బెల్ట్ దుకాణాల తొలగింపు ఉంటుందని స్పష్టం చేసింది.నేటి నుంచి 2023 సెప్టెంబర్ 30 వరకు ఈ పాలసీ అమలులో ఉంటుంది.

తిరుపతిలోని అలిపిరి మార్గంలో మద్యం దుకాణాలకు అనుమతి లేదని స్పష్టం చేసింది.రిటైల్ ఔట్ లెట్ల సంఖ్యకు మించకుండా వాక్ ఇన్ స్టోర్లు ఏర్పాటు చేస్తున్నారు.

వీటికి ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ అనుమతి ఇచ్చింది.అంతేకాకుండా రిటైల్ ఔట్ లెట్లలో మద్యం అమ్మకాలకు ట్రాక్ అండ్ ట్రేస్ విధానంలో పర్యవేక్షణ ఉంటుందన్న ప్రభుత్వం.

డిజిటల్ చెల్లింపులకు సైతం అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించింది.మరోవైపు ఎన్.హెచ్ వెంబడి మద్యం విక్రయాలపై సుప్రీం మార్గదర్శకాలు అమలు అవుతాయి.అనివార్యమైతే రిటైల్ దుకాణం మరో చోటకు తరలించేందుకు అనుమతి ఉంటుందని తెలిపింది.

ఈ తరలింపునకు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీకి అధికారాలు ఉంటాయని స్పష్టం చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube