నేడు సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ తిరుపతి జిల్లా పర్యటన

అమరావతి: నేడు సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ తిరుపతి జిల్లా పర్యటన.ఉదయం 09.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం, 11 గంటలకు తిరుపతి రూరల్‌ మండలం పేరూరు చేరుకుంటారు.11.15 – 11.45 గంటల వరకు శ్రీ వకుళమాత ఆలయ ప్రారంభోత్సవం, పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు.

 Ap Cm Jagan Tirupati Tour Today Details, Ap Cm Jagan , Jagan Tirupati Tour , Cm Jagan Mohan Reddy, Tcl Company, Hill Top Sezz Foot Wear India, Tirupati Airport, Tadepalli, Sri Vakulamatha Temple-TeluguStop.com

అనంతరం 12.05 గంటలకు శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు చేరుకుని హిల్‌టాప్‌ సెజ్‌ ఫుట్‌వేర్‌ ఇండియా లిమిటెడ్‌ (అపాచీ) పాదరక్షల తయారీ యూనిట్‌ నిర్మాణ పనుల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు.

అక్కడి నుంచి మధ్యాహ్నం 1 గంటకు ఏర్పేడు మండలం వికృతమాలలో ఈఎంసీ 1 పరిధిలోని టీసీఎల్‌ పరిశ్రమ వద్దకు చేరుకుని ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు.మధ్యాహ్నం 2.40 గంటలకు తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 3.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube