న్యూస్ రౌండప్ టాప్ 20

1.నీటిపారుదల శాఖలో 879 ఉద్యోగాలు

  నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి.ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్ లో 879 పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ గురువారం జీవో జారీ చేశారు.
 

2.ఏపీ స్టడీ సర్కిల్లో బ్యాంకు పరీక్షలకు ఉచిత శిక్షణ

  ఇండియన్ బ్యాంకింగ్ పర్సనల్ సర్వీసెస్ పరీక్షల కోసం ఎస్సీ ఎస్టీ ఇతర విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తామని ఏపీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.
 

3.25న బీసీ గురుకులాల ప్రవేశ పరీక్ష

Telugu Akash Missiles, Amma Odi, Seshadriexpress, Gold, Top-Latest News - Telugu

  మహాత్మ జ్యోతిబాపూలే బిసి సంక్షేమ గురుకులాల్లో ఇంటర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 25న పరీక్ష నిర్వహించనున్నట్లు ఆ సంస్థ కార్యదర్శి మల్లయ్య బట్టు తెలిపారు.
 

4.ఈ పాస్ స్కాలర్ షిప్ దరఖాస్తుల గడువు పెంపు

  ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈ బీసీ , మైనార్టీ , వికలాంగులకు ఈ – పాస్ పోస్ట్ మెట్రిక్ దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 31 వరకు పొడిగించారు.
 

5.నేటి మధ్యాహ్నం నుంచి రిజిస్ట్రేషన్ నిలిపివేత

  నేటి మధ్యాహ్నం నుంచి రెండు రోజుల పాటు తెలంగాణలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ నిలిపివేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
 

6.టిడిపికి ఎల్.రమణ రాజీనామా

Telugu Akash Missiles, Amma Odi, Seshadriexpress, Gold, Top-Latest News - Telugu

  తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ ఆ పార్టీకి రాజీనామా చేశారు ఆ లేఖను శుక్రవారం టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపించారు.
 

7.’ వన్ పాస్ ఆల్ ఎగ్జామ్స్ ‘ కూపన్ ఆవిష్కరణ

  అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం ‘ వన్ పాస్ ఆల్ ఎగ్జామ్స్ కాల్కస్ ఇండియా కూపన్ ‘ ను తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు గురువారం ఆవిష్కరించారు.
 

8.అమ్మ ఒడిలో లాప్ టాప్ ల పంపిణీ

Telugu Akash Missiles, Amma Odi, Seshadriexpress, Gold, Top-Latest News - Telugu

  అమ్మ ఒడి పథకం ద్వారా అందిస్తున్న నగదు బదులు ఈసారి విద్యార్థులకు లాప్ టాప్ లు  ఇవ్వనున్నారు.9,10, ఇంటర్ విద్యార్థులకు వీటిని ఇవ్వాలని నిర్ణయించారు.
 

9.భారత్ లో కరోనా

  గడచిన 24 గంటల్లో  దేశవ్యాప్తంగా కొత్తగా 43,393 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 

10.కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ తో వైసీపీ ఎంపీల భేటీ

  కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, మార్గాని భరత్ భేటీ అయ్యారు.ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు.
 

11.తిరుమల సమాచారం

  తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.గురువారం 17,736 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
 

12.విశాఖలో రెండు రోజులపాటు డీజీపీ పర్యటన

Telugu Akash Missiles, Amma Odi, Seshadriexpress, Gold, Top-Latest News - Telugu

  రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ రెండు రోజుల పాటు విశాఖలో పర్యటించనున్నారు.
 

13.రెడ్డి ఎంటర్ప్రైజెస్ వసూళ్లపై ఎంపీ రఘురామ లేఖ

  ఏపీబీసీఎల్ సిబ్బంది , రెడ్డి ఎంటర్ ప్రైజస్ వసూళ్లను ప్రస్తావిస్తూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో లేఖ రాశారు.
 

14.ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తే చర్యలు : ఇంటర్ బోర్డ్

  తెలంగాణలో ప్రత్యక్ష తరగతులు నిర్వహించే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు ప్రకటించింది.
 

15.17 నుంచి శేషాద్రి ఎక్స్ ప్రెస్ రైలు

Telugu Akash Missiles, Amma Odi, Seshadriexpress, Gold, Top-Latest News - Telugu

  బెంగళూరు కాకినాడ టౌన్ ల మధ్య సంచరించే శేషాద్రి ఎక్స్ ప్రెస్ రైలు సేవలు ఈనెల 17 నుంచి అందుబాటులోకి రానున్నట్లు నైరుతి రైల్వే గురువారం ప్రకటించింది.
 

16.సెప్టెంబర్ నుంచి 12 – 18 ఏళ్ల వారికీ టీకా

  దేశంలో కరోనా మహమ్మారి మూడోదశ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ను మరింత విస్తరించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.దీనిలో భాగంగానే 12 నుంచి 18 ఏళ్ల లోపు వారికి సెప్టెంబర్ నుంచి టేకప్ పంపిణీ ప్రారంభించనున్నట్లు వ్యాక్సినేషన్ లపై జాతీయ నిపుణుల కమిటీ చీఫ్ ఎస్కే అరోరా తెలిపారు.
 

17.వాయిసేన కు ఆకాష్ క్షిపణులు

Telugu Akash Missiles, Amma Odi, Seshadriexpress, Gold, Top-Latest News - Telugu

  భారత వైమానిక దళానికి ఆకాశ్ క్షిపణులను సరఫరా చేసేందుకు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది.
 

18.14 నుంచి జోమటో పబ్లిక్ ఇష్యూ

  జొమాటో పబ్లిక్ ఇష్యూ ఈ నెల 14న ప్రారంభమైన 16న ముగియనుంది.
 

19.కంటతడి పెట్టిన తెలంగాణ మంత్రి

Telugu Akash Missiles, Amma Odi, Seshadriexpress, Gold, Top-Latest News - Telugu

  కురవి మండలం బంగారి గూడెంలో గురువారం గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించారు.గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నాయకుడు గాంధీ సోదరి, బావ అ ఇటీవల కరోనాతో మృతిచెందగా గాంధీని ఆయన తల్లి దశుధ ను మంత్రి పరామర్శించారు.ఈ సందర్భంగా ఆమె కంటతడి పెట్టారు.
 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,990   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,990    

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com
.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube