అనుపమకు అలాంటి వారిని చూస్తే సిగ్గేస్తుందట.. ఎందుకో తెలుసా?

ప్రేమమ్ సినిమాతో కుర్రకారు మనసులు దోచుకున్న మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే తెరపై, తెర వెనుకాలా.

 Anupama Parameshwaran Serious On Who Thrown Wastage On Road , Actress Anupama Pa-TeluguStop.com

ఎప్పుడూ అందంగా నవ్వుతూ ఉండే ఈ అందాల ముద్దుగుమ్మ ఈరోజు కొందరిపై సీరియస్ అయింది.నిద్ర లేస్తూ లేస్తూనే.

కొందరిని తిట్టి పోసింది.సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తనకు సంబంధించిన అప్ డేట్లతో పాటు సమాజానికి సంబంధించిన విషయాలను కూడా పోస్ట్ చేస్తుంది.

అయితే ఇప్పుడు కూడా అదే పని చేసింది.

రోడ్డుపై పలు చోట్ల కుప్పలు కుప్పలుగా చెత్త వేసి ఉండటం.

అక్కడ పశువులు వాటిని తింటూ కనిపిస్తున్న ఫొటోలను అనుపమ తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది.అయితే వీటిపై అనుపమ పరమేశ్వరన్ అందరినీ బాధ్యుల్ని చేసి తిట్టేసింది.“నా గుడ్ మార్నింగ్ రోజూ ఇలానే మొదలవుతుంది.ఇంకా ఈ భూమ్మీద ఇలాంటివి చేస్తూ ఈ ప్రకృతిని ఇలా చేస్తున్న వారిని చూస్తుంటే నాకు సిగ్గుగా ఉంది.” సేవ్ ఎర్స్, సేవ్ ప్లానెట్ అనే హ్యాష్ ట్యాగల్ తో అనుపమ పోస్ట్ చేసింది.

Telugu Actressanupama, Anupama Latest-Latest News - Telugu

అయితే అనుపమ చేసిన ఈ పోస్టును చూసిన కొందరు నెటిజెన్లు ఈమెకు వత్తాసు పలికారు.మరి కొందరేమో… ఇలా పోస్టు చేసే బదులు నువ్వే వెళ్లి వాటిని క్లీన్ చేస్తే.నిన్ను చూసి పది మంది ఇన్ స్పైర్ అవుతారుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ నిఖిల్ తో కిలిసి సినిమాలు చేస్తోంది.18 పేజీస్, కార్తికేయ 2 వంటి సినిమాలతో తెలుగు సినీ ప్రేక్షకులను పలకరించబోతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube