ప్రీ పోల్ స‌ర్వేల‌ను బ్యాన్ చేయాలంట‌.. స‌రికొత్త డిమాండ్‌

మ‌న దేశంలో ఎన్నిక‌లు ఎంత కామ‌నో వాటికి ముందు ప్రీపోల్ స‌ర్వేలు కూడా చాలా కామ‌న్ అన్న‌మాట‌.అయితే ఇలా ఎన్నిక‌ల‌కు ముందు చెప్పే పోల్స్‌లో ఒక్కోసారి ఒక్కో విధంగ ఉంటాయి.

 Banning Pre-poll Surveys .. New Demand,  Pre-poll Surveys,  Mayavathi, Poltics ,-TeluguStop.com

ఇందులో చెప్పిన వారు ఒక్కోసారి గెలుస్తారు ఒక్కోసారి ఓడిపోతారు.ఇలాంటి స‌మ‌యంలో వీటి గురించి అటు జ‌నాల్లోనూ ఇటు అభ్య‌ర్థుల్లోనూ పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది.

ఇవి ప్ర‌క‌టించే ఫ‌లితాల ఆధారంగానే త‌మ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఉంటాయ‌ని అటు అభ్య‌ర్థులు కూడా భావిస్తుంటారు.అయితే ఇప్పుడు వీటిని బ్యాన్ చేయాలంటే కొత్త డిమాండ్ వ‌స్తోంది.

అదేంటంటే మ‌న దేశంలో 2024లో వ‌చ్చే సార్వత్రిక ఎన్నికలకు ఇప్ప‌టి నుంచే అన్ని ప్ర‌ధాన పార్టీలు రెడీ అవుతున్నాయి.ఇందుకోసం ప‌క్కా వ్యూహాలు ప‌న్నుతున్నాయి.కాగా ఈ ఎన్నిక‌ల‌కు త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌బోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల‌ను అన్ని పార్టీలు సెమీ ఫైనల్స్ గా భావిస్తున్నాయి.ఇందులో గెలిస్తే ఇక త‌మ పార్టీకి తిరుగులేద‌ని భావిస్తున్నాయి.

ఎందుకంటే అన్ని రాష్ట్రాల కంటే కూడాయూపీలోనే ఎక్కువ సీట్లు ఉంటాయి కాబ‌ట్టి దీన్ని ప్రాధాన్యంగా తీసుకుంటున్నాయి.కాగా ఇందులో పోటీ చేస్తున్న పార్టీలు ఇక్క‌డ గెలిస్తే ఢిల్లీలో కీలకభూమిక పోషించే అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నారు.

Telugu Bjp, Bsp, Delhi, Mayavathi, Demand, Poltics, Pre Surveys, Assembly-Latest బీఎస్పీ అధినేత్రి మాయావతి స‌రికొత్త నినాదాన్ని ప్ర‌క‌టించారు.అదేంటంటే యూపీ ఎన్నికల్లో ఆరు నెల‌ల‌కు ముందే అటు మీడియా సంస్థల‌తో పాటుగా ఇటు కొన్ని ప్రైవేటు ఏజెన్సీలు నిర్వ‌హించే ప్రీ పోల్ సర్వేల‌న్నింటినీ బ్యాన్ చేయాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు.ఎందుకంటే వీటివ‌ల్ల ఒక్కోసారి భిన్న‌మైన ఫ‌లితాలు వ‌స్తున్నాయి కాబ‌ట్టి అభ్య‌ర్థులు ఇబ్బంది ప‌డుతున్నార‌ని పైగా ప్ర‌జ‌ల్లోకి కూడా త‌ప్పుడు స‌మాచారం వెళ్లే ఆస్కారం ఉంటుంద‌ని చెబుతున్నారు.ఎన్నికల కమిషన్ వ‌ద్ద‌కు కూడా ఈ ప్ర‌తిపాద‌న‌ను తీసుకెళ్లి చెబుతానంటున్నారు.

ఇది మంచిదే అయినా ఏ మేర‌కు ఫ‌లిస్తుందో చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube