మోహన్‌ బాబు ఔను అనలేదు... కాదనలేదు

కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు మూడు దశాబ్దాల క్రితమే రాజకీయాల్లోకి వెళ్లాడు.ఎన్టీఆర్‌ ఆహ్వానం మేరకు రాజకీయాల్లో అప్పుడు క్రియాశీలకంగా వ్యవహరించాడు.

 Andhra Pradesh Ttd New Chairmen Collection King Mohan Babu In Soon-TeluguStop.com

అయితే ఎన్టీఆర్‌ మరణం తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరం అయ్యి సినిమాలకే పూర్తి సమయం కేటాయించాడు.మళ్లీ ఇన్నాళ్లకు మొన్నటి ఎన్నికల సమయంలో జగన్‌కు మద్దతుగా నిలుస్తూ వైకాపా కండువ కప్పుకున్నాడు.

తెలుగు దేశం పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసిన విషయం తెల్సిందే.

వైఎస్‌ జగన్‌ సీఎం అవ్వడంతో మోహన్‌బాబు దశ తిరిగినట్లయ్యింది.

మోహన్‌బాబుకు టీటీడీ పదవి ఇవ్వడం ఖాయం అంటూ అంతా భావిస్తున్నారు.టీటీడీ చైర్మన్‌ పదవిని త్వరలోనే మోహన్‌బాబుకు కట్టబెట్టబోతున్నట్లుగా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో మోహన్‌బాబు స్పందించాడు.తాను టీటీడీ చైర్మన్‌ రేసులో ఉన్నట్లుగా మీడియాలో వస్తున్న వార్తల గురించి ట్విట్టర్‌ ద్వారా స్పందించాడు.

-Political

మోహన్‌ బాబు ట్విట్టర్‌ లో.గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి, కొందరు ఫోన్‌ చేస్తున్నారు.నేను మొదటి నుండి రాజకీయాల్లో మంచి వారు ఉండాలనే ఉద్దేశ్యంతో ఉన్నాను.జగన్‌ సీఎం అయితే బాగుంటుందని ఆయనకు మద్దతు ఇవ్వడం కోసం రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాను.

అయితే రాజకీయాల్లో తాను రీ ఎంట్రీ ఇచ్చింది జగన్‌ సీఎం అవ్వడానికి తప్ప మరే పదవుల కోసం కాదు అన్నాడు.పదువుల కోసం కాదు అన్న మోహన్‌బాబు టీటీడీ చైర్మన్‌ పదవి ఇస్తానంటూ వద్దంటాడా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

జగన్‌ ఖచ్చితంగా టీటీడీ పదవి మోహన్‌బాబుకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ సినీ వర్గాల వారు మరియు రాజకీయ వర్గాల వారు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube