దిల్ రాజుతో నైట్ పార్టీలో హీరోయిన్ అనుపమ.. జోరు మామూలుగా లేదుగా!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు సిరీస్ తనయుడు ఆశిష్ హీరోగా నటించిన తాజా చిత్రం రౌడీ బాయ్స్.ఇందులో ఆశిష్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన విషయం అందరికీ తెలిసిందే.

 Anaupama Parameswaran Dil Raju And Ashish Enjoys At Cafe In Night Time Anupama P-TeluguStop.com

ఈ సినిమా తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలో విడుదల అయ్యింది.ఇక ఆశీష్ తన సినిమా లాంచ్ చేయడం కోసం బాగానే కష్టపడ్డాడు.

ఇందుకోసం ఇండస్ట్రీలోని టాప్ హీరోలందరూ కూడా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తీసుకు రావడం జరిగింది.

ఈ క్రమంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరో అయిన ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇలా టాప్ హీరోలతో ప్రమోషన్ లను చేయించాడు.

కానీ సినిమా మాత్రం దారుణమైన పరాజయాన్ని చవిచూసేలా ఉంది.అయితే సినిమా టీజర్ చూసి బోలెడు ఆశలతో థియేటర్ కి వెళ్లిన అభిమానులు సినిమాలో అనుపమ లిప్ లాక్ సీన్ తప్ప ఇంకేమీ లేదని అంటున్నారు.

ఎన్నో ఆశలతో థియేటర్ కి వెళ్లిన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురయింది.దిల్ రాజు కు చేదు అనుభవం ఎదురయింది.

ఒక డెబ్యూ నిర్మాత మూవీని దిల్ రాజు ఇంత నాసిరకంగా ప్లాన్ చేస్తారు అని ఎవరు ఊహించి ఉండరు.ఇక ఈ సినిమాతో పాటు రిలీజ్ అయినా బంగార్రాజు సినిమా మంచి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.

అలాగే అశోక్ గల్లా హీరోగా నటించిన హీరో సినిమా కూడా బోల్తా కొట్టేసింది.

హీరో సినిమాకు కొన్ని కొన్ని చోట్ల మిక్స్డ్ టాక్, మరికొన్నిచోట్ల నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ చిత్రయూనిట్ మాత్రం ఫుల్ చిల్ అవుతున్నట్లు తెలుస్తోంది.ఇక రౌడీ బాయ్ సినిమా చిత్ర బృందం విషయానికి వస్తే వీకెండ్ ని ఆశిష్,దిల్ రాజు,అనుపమ అందరూ కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేసినట్టు తెలుస్తోంది.ఇందుకు సంబందించిన వీడియోని అనుపమ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది.

ఆ వీడియోలో అనుపమ తో పాటు ఇందులో ఆశీష్, దిల్ రాజులు కనిపించారు.వారితో పాటుగా చిత్రయూనిట్ కూడా ఉంది.

మొత్తానికి అనుపమ ఖాతాలో మరో ఫ్లాప్ పడ్డట్టు అయింది.

Anupama Parameswaran Dil Raju Enjoys At Cafe In Night Time

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube