తన రీసెంట్ మూవీ పుష్పక విమానం కోసం ఆ సినిమా హీరో ఆనంద్ దేవరకొండ ప్రొడ్యూసర్ అయిన తన సోదరుడు విజయ్ దేవరకొండతో కలిసి వరుసగా ఇంటర్వ్యూలు చేస్తున్నాడు.తమ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు ఆనంద్ దేవరకొండ చాలా ఫన్నీగా ఆన్సర్ చేశాడు.ప్రస్తుతం ఆనంద్ ఆన్సర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది.
ఈ వైరల్ వీడియోలో విజయ్ దేవరకొండ తన తమ్ముడు ఆనంద్ ను నీ మొదటి జీతం ఎంత అని అడుగుతాడు.ఈ ప్రశ్నలు విజయ్ సంధించలేదు.
వివిధ ప్రాంతాలకు చెందిన అభిమానులు అడిగిన ప్రశ్నలను విజయ్ ఆనంద్ దేవరకొండను అడిగాడు.
మొదటి జీతంగా ఎంత సంపాధించావు అనే ప్రశ్నకు ఆనంద్ 12 వేలు అని చెప్పగా దానికి విజయ్ ఒప్పుకోలేదు.ఇక్కడ అడిగింది నీ ఇంటర్న్ షిప్ జీతం గురించి కాదని అంటాడు.దీంతో ఆనంద్ ఆలోచించి తాను యూఎస్ లో ఉండగా.
దాదాపు 75 వేల డాలర్లు సంపాధించానని చెబుతాడు.దీనికి విజయ్ దానిని రూపాయల్లోకి మార్చి చెప్పమనగా.
ఏడాదికి దాదాపు 40 లక్షలు సంపాధించానని చెబుతాడు.ఎంత శాతం టాక్స్ కట్టావని విజయ్ అడగా దానికి దాదాపు 34 శాతం టాక్స్ రూపంలో పే చేశానని చెబుతాడు.
ఆనంద్ దేవరకొండ షార్ట్ ఫిల్సింలో చేశాడా అని విజయ్ ప్రశ్నించగా.లేదని ఆనంద్ సమాధానం చెబుతాడు.
అంటే ఆనంద్ దేవరకొండ యూఎస్ లో వర్క్ చేసి వచ్చి సినిమాల మీద ఫ్యాషన్ తో ఇక్కడ సినిమాల్లో వర్క్ చేస్తున్నాడన్న మాట.తన బెస్ట్ ఫ్రెండ్స్ గురించి అడగ్గా.యూఎస్ లో చాలా మంది ఉన్నారని ఆనంద్ చెప్పాడు.పుష్పక విమానం సినిమాను దామోదర అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కించగా.సాన్వీ మేఘన హీరోయిన్ గా నటిస్తోంది.ఈ సినిమాను డైరెక్టర్ ఔట్ అండ్ ఔట్ కామెడీగా తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది.
నవంబర్ 12 న ఈ సినిమా రిలీజ్ కానుంది.