అమెరికాలో సామూహిక సిక్ లీవ్స్..సమ్మెబాట లో ఉద్యోగులు..!!!

అమెరికాలో కరోనా పంజా కి ఇప్పటికే 4 వేల మందిపైగా ప్రజలు చనిపోగా సుమారు 2 లక్షల కేసులు నమోదు అయ్యాయి.ఒక్క న్యూయార్క్ సిటీలోనే దాదాపు 1500పైగా మరణాల సంఖ్య నమోదు కావడంతో చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర భయభ్రాంతులకి లోనవుతున్నారు.మరో పక్క ప్రభుత్వం సరైన సదుపాయాలు ఇవ్వడంతో లేదంటూ నర్సులు, డాక్టర్స్ ఆందోళనలు చేపడుతున్నారు.ఇదిలాఉంటే…

 Paid Sick Leave, Grocery Delivery Workers, America, Coronavirus Protection, Work-TeluguStop.com

అమెరికాలో ఇప్పుడు ఆహార ఉద్యోగులు సమ్మె బాట పట్టారు.ఈ కరోనా మహమ్మారి నుంచీ మాకు రక్షణ ఇవ్వండి అంటూ అమెరికా వ్యాప్తంగా ఉన్న ఆహార ఉద్యోగులు సిక్ లీవ్స్ పెట్టేశారు.కరోనా భారినపడి అనారోగ్యంతో కొట్టి మిట్టడుతున్న ఉద్యోగులకి వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

తమకి రక్షణ కల్పిస్తేనే తిరిగి విధులకి హాజరవుతామని తేల్చి చెప్తునారు.

Telugu America, Coronavirus, Paid Sick Leave-

అంతేకాదు…ఉద్యోగులు అందరికి ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహించాలని, జీతాలు పెంచాలని అమెజాన్ ఫుడ్స్ కి చెందిన ఉద్యోగులు అందరూ రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు.కరోనా బారిన పడి విదులకి హాజరవ్వలేని ఉద్యోగులకి రెట్టింపు వేతనం ఇవ్వాలని కేవలం రెండు వారాల వేతనాలతో కూడిన సెలవులు ఇస్తే సరిపోదని డిమాండ్ చేశారు.ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా అన్ని కంపెనీల ఫుడ్ వర్కర్స్ ఇదే రకంగా సమ్మె బాటలో పయనించడంతో సదరు కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube