'మంకీపాక్స్' పేరుని మార్చమని అమెరికా వేడుకుంటోంది.. ఎందుకంటే?

ఆశ్చర్యం.మంకీపాక్స్ పేరు మార్చమని అమెరికా WHOని వేడుకుంటోంది.

 America Is Want To Change The Name Of 'monkeypox' Because Monkey Pox, Name Chan-TeluguStop.com

దీని వెనుక ఓ కధే వుంది.ఇటీవలికాలంలో చూసుకుంటే మంకీపాక్స్ అనేది ఏవిధంగా వివిధ దేశాలకు పాకుతుందో తెల్సిన విషయమే.

ఇక ఈ వ్యాధి ప్రాణాంతకం కాదు అంటూనే వైర‌స్ వ్యాప్తిపై తీవ్ర భ‌యాందోళ‌న‌లు రేకెత్తిస్తున్నారు.ఈ వైర‌స్‌పై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఇప్ప‌టికే అంత‌ర్జాతీయంగా ఎమ‌ర్జెన్సీని ప్ర‌క‌టించింది.

అయితే, ఈ వైర‌స్‌ కేవలం లైంగిక చ‌ర్య‌ల వ‌ల్లే సంక్ర‌మిస్తుంద‌ని చెబుతుండ‌టంతో వ్యాధిగ్ర‌స్తులను నిందాపూరితంగా చూస్తున్నట్లు నివేదిక‌లు వ‌స్తున్నాయి.

కాబ‌ట్టి, వ్యాధి సోకి, చికిత్స‌ ఆల‌స్యం అయ్యే రోగులు వివిధరకాల వివ‌క్ష‌కు లోను అవుతున్నారని, అలా జరగకుండా ఉండ‌టం కోసం వైర‌స్ పేరును మార్చాల్సిందిగా, న్యూయార్క్ నగరం జూలై 26న ప్రపంచ ఆరోగ్య సంస్థ అయినటువంటి WHOని అభ్యర్థించింది.న్యూయార్క్ నగర ప్రజారోగ్య కమిషనర్ అశ్విన్ వాసన్, WHO డైరెక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్‌కి రాసిన లేఖలో పేర్కొంటూ.“మంకీపాక్స్ వైరస్ చుట్టూ ఉన్న అపోహ‌ల కార‌ణంగా వ్యాధి సోకినవారిపై వివ‌క్ష‌ ప్రభావాల గురించి మాకు ఆందోళన పెరుగుతోంది.ఇది దురదృష్టకరం!” అని వెల్ల‌డించారు.

Telugu America, Monkey Pox, Change, Latest-Latest News - Telugu

ఇక‌, ఇప్పటివరకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా చూసుకుంటే, మంకీపాక్స్ కేసులు దాదాపు 20 వేలకు ద‌గ్గ‌ర‌గా ఉండ‌గా అమెరికాలోనే 3 వేల కేసుల‌కు పైగా బయటపడ్డాయి.అయితే, USలో ఇతర నగరాల కంటే న్యూయార్క్‌లో కేసులు ఎక్కువగా ఉన్నాయి.అయితే ఈ వ్యాధిని పడ్డవారు ఇప్పటివరకు, యూరప్‌లో గానీ, యునైటెడ్ స్టేట్స్‌లో గానీ ఎక్కడ చనిపోయినట్టు దాఖలాలు లేవు.

దీనిపై, వాసన్ వాస్తవాలను సూచిస్తూ, పేరుకు విరుద్ధంగా, మంకీపాక్స్ వాస్తవానికి ప్రైమేట్స్‌లో కనిపించలేదని, హెచ్‌ఐవి మహమ్మారి ప్రారంభ దశలో వ‌చ్చిన ప్రతికూల ప్రభావాల వంటిదే ఇప్పుడూ కొన‌సాగుతున్న‌ట్లు తెలిపారు.ఆసియా కమ్యూనిటీలు గతంలో వ్యవహరించిన జాత్యహంకారాన్ని గుర్తుచేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube