Jabardasth Anand: నన్ను టీమ్ లీడర్స్ ఎవరూ చేర్చుకోలేదు.. జబర్దస్త్ పై కమెడియన్ ఆనంద్ షాకింగ్ కామెంట్స్!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ ఆనంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో ఆనంద్ కూడా ఒకరు.

 Adhurs Anand Shocking Comments On Jabardasth Details, Adhurs Anand, Shocknig Com-TeluguStop.com

చాలామంది ఆనంద్ అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ అదుర్స్ ఆనందం అంటే చాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు.జబర్దస్త్ షోలో ఎన్నో స్కిట్ లలో గెటప్ లు వేసి తనదైన శైలిలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు.

ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో జబర్దస్త్ నుంచి కమెడియన్ లు ఒక్కొక్కరిగా జబర్దస్త్ ను వీడి వెళ్ళిపోతున్న విషయం తెలిసిందే.అయితే జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన కంటెస్టెంట్లు జబర్దస్త్ షో గురించి షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.

గతంలో కిరాక్ ఆర్పి అప్పారావు లాంటి కొందరు కమెడియన్స్ జబర్దస్త్ చేసిన విషయం తెలిసిందే.తాజాగా జబర్దస్త్ షోపై మరొక కమెడియన్ అయినా అదుర్స్ ఆనంద్ కూడా షాకింగ్ కామెంట్స్ చేశాడు.

తనని అన్యాయంగా జబర్దస్త్ షో నుంచి తీసేశారని ఆరోపించాడు.పిల్లలున్నారని చేతులెత్తి మెుక్కినా కూడా వినిపించుకోకుండా తీసేసారు అని భావోద్వేగానికి గురైయ్యాడు.

చమ్మక్ చంద్ర టీమ్ లో ఆనంద్ మెయిన్ కంటెస్టెంట్ గా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.ఆ తర్వాత అదుర్స్ ఆనంద్ అంటూ కొత్త టీం లీడర్ గా ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆనంద్ తనను టీం లీడర్ గా తొలగించడంపై స్పందించాడు.

Telugu Adhurs Anand, Anand, Jabardasth, Sattipandu, Shocknig, Youtube Channel-Mo

ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ.నేను జబర్దస్త్ షో నుంచి బయటకు వచ్చాక కొన్ని సీరియల్స్ తో పాటు ఒక యూట్యూబ్ ఛానల్ ను నడుపుతున్నాను.అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా వేశాను.

ప్రస్తుతానికైతే జీవితం సజావుగానే సాగుతోందని ఆనంద్ తెలిపాడు.జబర్దస్త్ నుంచి తొలగించడం గురించి స్పందిస్తూ.

జబర్దస్త్ లో చమ్మక్ చంద్రన్న దగ్గర నేర్చుకున్న నటనను.ఆయన ప్యాట్రన్ ను నేను టీమ్ లీడర్ అయ్యాక కూడా కొనసాగించాను.

నా స్కిట్స్ కు లక్షల్లో సైతం వ్యూస్ వచ్చేవి, మీరు ఇప్పుడు చూసినా కనిపిస్తుంది.

Telugu Adhurs Anand, Anand, Jabardasth, Sattipandu, Shocknig, Youtube Channel-Mo

అయితే ఇంతకు ముందు జబర్దస్త్ గంటన్నర ఉండేది.తర్వాత దాన్ని గంటకు కుదించారు.ఈ క్రమంలోనే 6 టీమ్ లను 5 టీమ్ లుగా చేశారు.

ఆరో టీమ్ గా ఉన్న నన్ను సత్తి పండు గారిని వేరే టీమ్ లో కలుపుతాం అన్నారు.కానీ ఏ టీమ్ లీడర్ మమ్మల్ని కలుపుకోవడానికి ఇష్టపడలేదు, దాంతో మమ్మల్ని తీసేయడానికి సిద్దపడ్డారని చెప్పుకొచ్చాడు ఆనంద్.

అప్పుడు నాకు పిల్లలు ఉన్నారు నన్ను తీసేయకండి అని జబర్దస్త్ యాజమాన్యానికి చేతులెత్తి మొక్కిన తన బాధను పట్టించుకోలేదు అని ఆవేదన వ్యక్తం చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube