ఆ హీరో ని చూస్తే అసహ్యం వేస్తుంది అంటూ విజయశాంతి సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా ఇండస్ట్రీ లో ఒక హీరోయిన్ కెరీర్ పరిమితి కేవలం 5 ఏళ్ళు లేదా పదేళ్లు ఉంటుంది.కొంతమంది హీరోయిన్స్ రెండు మూడు దశాబ్దాలు కూడా కొనసాగిన వాళ్ళు ఉన్నారు.

 Actress Vijayashanti Shocking Comments About That Hero Details, Actress Vijayash-TeluguStop.com

కొంత మంది కేవలం హీరోయిన్ రోల్స్ తో రెండు దశాబ్దాలు కొనసాగిన వాళ్ళు ఉన్నారు.కానీ వీళ్ళందరికీ అతీతంగా విజయశాంతి( Vijayashanti ) మాత్రం హీరోలతో సమానంగా స్టార్ ఇమేజి సంపాదించుకొని సౌత్ ఇండియా లో మొట్టమొదటి లేడీ సూపర్ స్టార్ గా, లేడీ అమితాబ్ బచ్చన్ గా పేరు తెచ్చుకుంది.

ఆరోజుల్లో ఈమె హీరోలకంటే ముందుగా కోటి రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకున్న ఏకైక ఆర్టిస్ట్ గా చరిత్ర సృష్టించింది.ఈమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ వంటి సూపర్ స్టార్ సినిమాలతో సమానంగా వసూళ్లు రాబట్టేవి.

వాళ్ళతో సమానంగా డైలాగ్స్ , డ్యాన్స్ మరియు వీరోచితంగా ఫైట్స్ చేసేది.

Telugu Balakrishna, Chiranjeevi, Sahasabaaludu, Tollywood, Vijaya Shanti, Vijaya

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే అలా చేసిన మొట్టమొదటి హీరోయిన్ గా విజయశాంతి చరిత్ర సృష్టించింది.ఆ రోజుల్లో ఈమె సినిమా వసూళ్లు పెద్ద హీరోల సినిమాల వసూళ్లను దాటేస్తుండడం వల్ల, ఈమె వెనుక చేరి గోతులు తవ్విన హీరోలు చాలా మంది ఉన్నారట.ఈ విషయమే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.

మీ స్టార్ స్టేటస్ కొంతమంది స్టార్ హీరోలను( Star Heros ) స్టేటస్ ని కూడా దాటేస్తుంది.మీపై కుట్రలు ఏమైనా జరిగాయా ఆ సమయం లో అని యాంకర్ అడగగా, దానికి విజయ శాంతి సమాధానం చెప్తూ, ఉన్నారుగా చాలా మంది ఉన్నారు, కానీ నా ముందు చెయ్యరు, వెనుక నుండి గోతులు తవ్వుతూ ఉంటారు.

ఒక హీరో అలాగే చేసాడు, అతన్ని చూస్తే ఇప్పటికీ నాకు అసహ్యంగానే ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది.

Telugu Balakrishna, Chiranjeevi, Sahasabaaludu, Tollywood, Vijaya Shanti, Vijaya

అంతే కాకుండా ఆరోజుల్లో నేను చేసే ఫైట్స్ హీరోలు కూడా చేసి ఉండరు, ‘సహస బాలుడు విచిత్ర కోతి’( Sahasa Baaludu Vichitra Kothi ) సినిమా క్లైమాక్స్ షూటింగ్ సమయం లో నాకు ఒక కాలు పూర్తిగా విరిగిపోయింది.కట్టు కట్టుకొని, కేవలం ఒక్క కాలితోనే ఆ సినిమా షూటింగ్ ని పూర్తి చేశాను, నేను అంత మొండిగా ఉండేదానిని అంటూ చెప్పుకొచ్చింది విజయ శాంతి.ప్రస్తుతం ఈమె రాజకీయాల్లో ఫుల్ బిజీ గా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే.

మళ్ళీ చాలా కాలం తర్వాత ఆమె సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన ‘సరిలేరు నీకెవ్వరూ’( Sarileru Neekevvaru ) చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమా తర్వాత మళ్ళీ సినిమాల్లో నటించబోనని ఒక ప్రకటన చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube