తల్లి పాత్రలో నటి వరలక్ష్మి శరత్ కుమార్.. ఏ సినిమా అంటే?

క్రాక్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి వరలక్ష్మి శరత్ కుమార్. ఈ సినిమాలో ఈమె జయమ్మ పాత్రలో విలన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

 Actress Varalakshmi Sarath Kumar To Play Mother Role In Sabari Movie,actress Var-TeluguStop.com

ఈ సినిమాతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ అనంతరం వరుస సినిమా అవకాశాలను అందుకొని తెలుగు తమిళ భాషలలో ఎంతో బిజీగా ఉన్నారు.ఇకపోతే తాజాగా ఈమె శబరి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా ద్వారా అనిల్‌ కాట్జ్‌ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.ఇక ఈ సినిమా తెలుగు తమిళ మలయాళ హిందీ భాషలలో విడుదల కానుంది.

ఇకపోతే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ను చిత్ర బృందం అభిమానులతో పంచుకున్నారు.ఈ క్రమంలోనే ఈ సమావేశంలో భాగంగా వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ… ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ కొడైకెనాల్ లో పూర్తి చేసుకున్నారు.

ఈ విషయాన్ని ఈమె తెలియజేస్తూ గత రెండు వారాలుగా కొడైకెనాల్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ సోమవారంతో ముగిసింది.ఈ షెడ్యూల్ చిత్రీకరణ చాలా త్వరగా పూర్తి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

Telugu Anil, Krack, Mother, Sabari, Villain-Movie

ఈ సినిమాని ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న అంటూ ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు.ఇక ఈ సినిమా గురించి డైరెక్టర్ అనిల్ మాట్లాడుతూ ఇందులో ఒక కూతురిని కాపాడుకోవడం కోసం ప్రాణాలు తెగించే ఒక తల్లి పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించారని ఈయన తెలియజేశారు.ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని ఈయన ఆశ భావం వ్యక్తం చేశారు.ఇక నిర్మాత మహేంద్ర నాథ్ మాట్లాడుతూ ఈ సినిమా ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఈ సినిమా తర్వాత షెడ్యూల్ వైజాగ్లో చిత్రీకరణ జరుపుకుంటుంది అంటూ ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ విడుదల చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube