జయం సినిమాతో వెళ్ళవయ్యా వెళ్ళు అంటూ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి సదా మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఈ సినిమా మంచి హిట్ కావడంతో ఈమెకు తెలుగులో పాటు తమిళంలో కూడా వరుస అవకాశాలు వచ్చాయి.
ఇలా నటిగా ఒకానొక సమయంలో ఎంతో బిజీగా గడిపిన సదా ప్రస్తుతం వెండితెరకు దూరంగా ఉన్నారు.ఇలా వెండి తెరకి దూరమైన ఈ ముద్దుగుమ్మ బుల్లితెర కార్యక్రమాల ద్వారా సందడి చేశారు.
అయితే తాజాగా ఈమె హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు.
ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె నటిగా మనం ఒక సినిమాకు కావలసినంత న్యాయం చేస్తాము ఆ సినిమా ఎలా రిసీవ్ చేసుకోవాలన్నది ప్రేక్షకుల పైన ఆధారపడి ఉంటుందని తెలిపారు.
సినిమా హిట్ అయితే సంతోషించడం ఫ్లాప్ అయితే డిప్రెషన్ లోకి వెళ్లడం సరైనది కాదని ఈమె తెలిపారు.ఇకపోతే తను యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఈ సందర్భంగా తన యూట్యూబ్ ఛానల్ లో ఎంతోమంది తనకు కామెంట్లు చేస్తూ పెళ్లి గురించి అడిగారని తెలిపారు.
ఈ సందర్భంగా పెళ్లి గురించి ఈమె మాట్లాడుతూ పెళ్లి అనేది పూర్తిగా నా వ్యక్తిగత విషయం అని చెప్పుకొచ్చారు.ఈ క్రమంలోనే పెళ్లి గురించి ఈమె మాట్లాడుతూ… పెళ్లయిన తర్వాత తాను ఒకరిపై ఆధారపడి ఉండడం తనకు నచ్చదని తెలిపారు.పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎలా ఉండాలో కూడా ఈ సందర్భంగా వెల్లడించారు.
తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పూర్తిగా శాకాహారి అయి ఉండాలని ధనవంతులు కాకపోయినా పర్వాలేదు కానీ ఇతరుల పై ఆధారపడే వ్యక్తి తనకు నచ్చరంటూ ఈ సందర్భంగా కాబోయే భర్త గురించి ఈమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.