సినిమా రంగానికి చెందిన నటీనటులకు ఇతర రంగాలకు చెందిన వాళ్లతో పోలిస్తే సంపాదన ఎక్కువనే సంగతి తెలిసిందే.అయితే అదే సమయంలో సినిమాల్లోని నటీనటులకు ఇల్లు దొరకడం, పెళ్లి విషయంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయని చాలామంది సెలబ్రిటీలు చెబుతారు.100కు పైగా సినిమాలలో నటించి పాపులారిటీని సంపాదించుకున్న నటి పూర్ణిమ ఒక టాక్ షోలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
తన అసలు పేరు పూర్ణిమ అని మలయాళంలో మాత్రం సుధగా పరిచయమయ్యానని ఆమె వెల్లడించారు.
నాన్న అదానీ సంస్థలో డీజీఎంగా పని చేస్తున్నారని తాను రంగులరాట్నం అనే సీరియల్ లో నటిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు.యాక్టర్ కాకముందు సింగర్ కావాలని అనుకున్నానని ఆమె అన్నారు.
తమిళంలో తాను సాంగ్స్ కూడా పాడానని ఆమె చెప్పుకొచ్చారు.
సప్తపది సినిమా చేయాల్సి ఉన్నా నాట్యం రాకపోవడంతో ఆ సినిమాలో ఛాన్స్ కోల్పోయానని ఆమె తెలిపారు.
జంధ్యాలతో కలిసి తాను ఐదు సినిమాలలో పని చేశానని ఆమె చెప్పుకొచ్చారు.కోడి రామకృష్ణ నవ్వుతూ నటించేలా చేసేవారని హీరోయిన్ గా నటిస్తూనే సిస్టర్ రోల్స్ లో నటించడానికి కూడా తాను ఓకే చెప్పేదానినని ఆమె అన్నారు.సావిత్రి గారితో కలిసి తాను డాక్యుమెంటరీ చేశానని అది తన లక్ అని ఆమె చెప్పుకొచ్చారు.
తాను సినిమా నటిని కావడంతో ఆరు పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ అయ్యాయని ఆమె వెల్లడించారు.1998 సంవత్సరంలో తనకు మ్యారేజ్ జరిగిందని పెళ్లి తర్వాత తాను సినిమాలకు దూరంగా ఉన్నానని పూర్ణిమ చెప్పుకొచ్చారు.11 సంవత్సరాల వయస్సులో లవ్ లెటర్ వచ్చిందని భయమేసి అమ్మమ్మకు చెప్పానని ఆమె అన్నారు.మనిషికో చరిత్ర సినిమా షూటింగ్ సమయంలో గొల్లపూడి షాట్ లో డైలాగ్స్ బయటకు చెప్పకపోవడంతో కొట్టారని ఆమె చెప్పుకొచ్చారు.పూర్ణిమ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.