అక్కినేని నాగచైతన్య సరసన ఒక లైలా కోసం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి పూజా హెగ్డే.కెరియర్ మొదట్లో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ అనంతరం వరుస హిట్ సినిమాలలో నటించి ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నారు.
ఈ విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పూజా హెగ్డే తెలుగు తమిళ భాషలలో మాత్రమే కాకుండా హిందీలో కూడా సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా ఓవెలుగు వెలిగారు.
ఈ మధ్యకాలంలో పూజా హెగ్డే నటించిన సినిమాలన్నీ కూడా అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తున్నాయి.
ఈమె నటించిన వరుస మూడు సినిమాలు ఫ్లాప్ కావడంతో ఐరన్ లెగ్ అంటూ ఇండస్ట్రీలో తనపై ముద్ర వేశారు.ఇలా వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ ఈమె మరిన్ని అవకాశాలను అందుకోవడం విశేషం.
ప్రస్తుతం పూజ హెగ్డే త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం అందుకున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభమైన విషయం తెలిసిందే.
ఇకపోతే గత కొద్దిరోజుల నుంచి పూజా హెగ్డేకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈమె సన్నిహితులు తన ముక్కు అందంగా లేదంటూ తనకు సలహా ఇవ్వడంతో ఈమె ముక్కుకు సర్జరీ చేయించుకోవడానికి సిద్ధమైందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్తలపై తాజాగా పూజ హెగ్డే టీమ్ స్పందించారు.పూజా హెగ్డే సర్జరీ చేయించుకున్నారని వార్తలు వస్తున్నాయి.ఈ వార్తలలో ఏ విధమైనటువంటి నిజం లేదని, ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని కొట్టి పారేశారు.పూజా హెగ్డే కొద్ది రోజులుగా హాలిడే వెకేషన్ కోసం వెళ్లారు.
అంతేకానీ ఈమె ఇలాంటి సర్జరీ చేయించుకోలేదనీ పూజ టీమ్ క్లారిటీ ఇచ్చారు.