సీనియర్ నటుడు జీవా గురించి పెద్దగా పరిచయం అక్కర లేదు.విలక్షణ నటుడిగా తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
రక్తాలు కక్కేలా ఉండే తన కళ్లతో జనాలను విపరీతంగా భయపెడతాడు జీవా.ఆయనకున్న ఆ కళ్ల మూలంగానూ కెరీర్ తొలినాళ్లలో విలన్ గా అవకాశాలు వచ్చాయి.
నెమ్మదిగా తన చక్కటి నటనతో జనాలను విపరీతంగా అలరించాడు జీవా.విలన్ పాత్రలతో పాటు రకరకాల క్యారెక్టర్లు పోషించి మంచి పేరు సంపాదించాడు.
ఇండస్ట్రీలో చక్కటి నటుడిగా ముందుకు సాగుతున్నాడు.
ఇక జీవా పర్సనల్ విషయానికి వస్తే.
తను ప్రేమ వివాహం చేసుకున్నాడు.తన ఫేస్, కళ్లు చూసి ఎవరు ప్రేమిస్తారు? అనే డౌట్ రావొచ్చు.కానీ ముమ్మాటికీ తనది ప్రేమ వివాహం.ఇంతకీ తన లవ్ స్టోరీ ఎలా మొదలయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం.మద్రాసులో సినిమా అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగేవాడు జీవా.అప్పుడు చేతిలో చిల్లిగవ్వ ఉండేది కాదు.
డబ్బులు లేనప్పుడల్లా తనే జీవాకు డబ్బులు ఇచ్చేది.జీవా సొంతూరు గుంటూరు.
ఆయన ఇంటి దగ్గరే హనుమాయమ్మ స్కూలు ఉండేది.ఆమె ఆ స్కూలు విద్యార్థి.
స్కూలు టైం అయిపోయే సమయానికి అక్కడికి చేరుకుని జీవా తనను చూస్తూ ఉండేవాడు.అక్కడ బడ్డీ కొట్టు ఉండేది.
ఏదో కొనుక్కోవడానికి అక్కడికి వెళ్లేవాడు జీవా.అక్కడి నుంచి తనను చూసే వాడు.
అలా ఇద్దరి మధ్య కొంత కాలం ఈ చూపుల రాయభారం నడిచింది.కొద్ది రోజుల తర్వాత తన ప్రేమను ఆ అమ్మాయికి చెప్పాడు.
ఆమె కూడా ఓకే చెప్పింది.
కొద్ది రోజుల తర్వాత సినిమాల్లో వేషాల కోసం గుంటూరు నుంచి మద్రాసుకు వెళ్లాడు జీవా.అప్పుడు గుంటూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆమె ఉద్యోగం చేసేది.జీవా అక్కడే ఓ హోటల్లో ఉంటే సినిమా అవకాశాల కోసం తిరిగేవాడు.
అక్కడ తన డబ్బులు అయిపోతే ఆమెకు ఉత్తరం రాసేవాడు.ఆమె డబ్బు పంపించేది.
కొన్నాళ్ల తర్వాత జీవాకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.ఆర్థిక సమస్యలు తీరాయి.
అనంతరం జీవా తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.