నెటిజన్ల హృదయాలను కదిలిస్తున్న చెన్నై ఫుడ్ డెలివరీ బోయ్ స్టోరీ

మనుషులకు అవరోధాలు ఎన్ని ఉన్నా, సంకల్ప శక్తితో ఏదైనా సాధించవచ్చు.దానికి సరైన ఉదాహరణ ఓ జొమాటో డెలివరీ బాయ్ జీవితగాథ.

 A Chennai Food Delivery Boy Story That Is Touching The Hearts Of Netizens , Food-TeluguStop.com

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో వీల్ చైర్‌పై ఫుడ్ డెలివరీ చేస్తున్న వ్యక్తిని మనం చూడొచ్చు.రద్దీగా ఉండే వీధిలో చక్కగా ఆయన వీల్ చైర్ సాయంతో గమ్యస్థానాలకు వెళ్తూ, అక్కడ సమయానికి ఫుడ్ డెలివరీ చేస్తున్నాడు.

గ్రూమింగ్ బుల్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆయన వీడియో పోస్ట్ చేశారు.ఆరేళ్ల క్రితం గణేష్‌కు రోడ్డు ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి.

వెన్నెముకకు బలమైన గాయం కావడంతో అతడు వీల్ చైర్‌కే పరిమితం అయ్యాడు.అయినప్పటికీ కుటుంబ బాధ్యతలను మోసే భారాన్ని అతడు విడువ లేదు.

జొమాటో సంస్థలో ఫుడ్ డెలివరీ బోయ్‌గా చేరాడు.

మురుగన్ భారతదేశపు మొదటి వీల్‌చైర్ ఫుడ్ డెలివరీ భాగస్వామి అని చెప్పొచ్చు.

అతడి పరిస్థితి తెలిసిన ఐఐటీ మద్రాస్ పరిశోధకులు వినూత్న ఆవిష్కరణ చేశారు.అతడు ఫుడ్ డెలివరీ చేసేందుకు అనువైన టూ-ఇన్-వన్ వీల్‌చైర్‌ను రూపొందించారు.

సులభంగా ఫుడ్ డెలివరీ చేయడానికి మోటరైజ్డ్ వీల్ చైర్ గా దానిని తయారు చేశారు.ఇది ఒక బటన్‌ను నొక్కడం ద్వారా రయ్యిన వేగంగా వెళ్తుంది.

వెనుక భాగం సాధారణ వీల్‌చైర్‌గా మారుతుంది.ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఈ వీడియోకు ఇప్పటివరకు 9.6 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.వీడియోపై స్పందిస్తూ, ఒక వినియోగదారు వ్యక్తికి ఉద్యోగం ఇచ్చినందుకు జొమాటోకు సెల్యూట్ చేశాడు.

మరొకరు హ్యాట్సాఫ్ సార్ అని రాశారు.ఎవరైనా ఆయనను పై అంతస్తుల్లో ఫుడ్ డెలివరీ చేయమంటే ఏం చేస్తున్నారని కామెంట్ చేశాడు.

అయితే అతడి పరిస్థితి తెలుసుకుని కస్టమర్లే కిందికి వస్తున్నట్లు తెలిసింది.ఈ వీడియో చూసిన చాలా మంది కన్నీరు పెట్టుకున్నారు.

మురుగన్ నేడు ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube