మనం ఓడిపోతున్నామంటే, మరొకరు గెలిచినట్టే.మన దురదృష్టం ఇంకొకరి అదృష్టం.
సరిగ్గా ఇదే జరిగింది రామ్ చరణ్ విషయంలో.బ్రూస్ లో రూపంలో భారి పరాజయాన్ని తన ఖాతాలో వేసుకున్న చరణ్, తాను పడిపోతూ మూడు సినిమాలకి ఆసరాగా నిలిచాడు.
బ్రూస్ లీ ఫ్లాప్ మూలాన రుద్రమదేవి మంచి కలెక్షన్లు రాబడుతోంది.ముఖ్యంగా నైజాంలో పండగ వాతావరణాన్నీ బ్రూస్ లీ కన్నా ఎక్కువగా ఉపయోగించుకుంది రుద్రమదేవే అని చెప్పాలి.
మారోవైపు కంచె మొదటిరోజు మంచి ఒపెనింగ్స్ రాబట్టుకుంది.రెండురోజు కుడా డిసెంట్ గా కొనసాగించింది.
రాజుగారి గది లాంటి చిన్న సినిమా కూడా కొన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులను లాగింది అంటే పెద్ద సినిమా అయినా బ్రూస్ లీ సందడి లేకపోవడమే.సెలవుల్లో పెద్ద సినిమా హడవిడి లేకపోవడం బాధకరమే అయినా దాని వల్ల చిన్న సినమాలు లాభపడటం చిన్న ఓదార్పు.