హోదా రాలేదు... పైగా బస్సు చార్జీల భారం

అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోడీ ప్రత్యేక హోదా గురించి ప్రకటన చేయలేదని మండి పడుతున్న ఏపీ ప్రజల మీద బస్సు చార్జీల భారం పడింది.

అసలే కోపంతో ఉన్న ప్రజలు బస్సు చార్జీలు పెంచడంతో మరింత ఆగ్రహంగా ఉన్నారు.

ప్రతిపక్షాలు రాష్ట్రమంతా నిరసన ప్రదర్శనలు చేస్తున్నాయి.నిన్న మోడీ దిష్టి బొమ్మలు తగులబెడితే ఈ రోజు బాబు దిష్టి బొమ్మలు కాలుస్తున్నారు.

నిరసనల్లో కమ్యూనిస్టులు ముందు ఉంటారనే సంగతి తెలుసు కదా.శంకుస్థాపనను పండుగలా చేసిన ప్రభుత్వం వెంటనే భారం మోపి ప్రజలను కుంగదీసింది.ప్రభుత్వం బస్సు చార్జీలు ఎక్కువగానే పెంచింది.5 నుంచి 10 శాతం పెరిగాయి.శంకుస్థాపనకు 400 కోట్లు ఖర్చు చేసిన బాబు ఆ ఖర్చు పూడ్చుకోవడానికి బస్సు చార్జీలు పెంచారని కొందరు కామెంట్ చేస్తున్నారు.

తెలంగాణలో ప్రస్తుతం ప్రజలకు ఊరటగా ఉన్నా వరంగల్ ఉప ఎన్నిక తరువాత లేదా హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికల తరువాత చార్జీలు పెరుగుతాయని అనుకుంటున్నారు.ప్రభుత్వాలు ఖర్చులు పూడ్చుకోవాలంటే ముందుగా కనబడేది ఆర్టీసీ బస్సులే.

Advertisement
కూటమి మేనిఫెస్టో చూసి విస్తుపోతున్న ఏపీ ప్రజలు.. ఇవి అమలు చేస్తే శ్రీలంక కాదా అంటూ?

తాజా వార్తలు