హీరోయిన్ లు పబ్ లలో తాగి తందనాలు ఆడుతుంటారు అన్న సంగతి అందరికీ తెలిసిందే .కొంతమంది బీచ్ లలో అర్ధరాత్రి తప్పతాగి గొడవ చేసిన సంఘటనలు కూడా జరిగాయి .
కాని ఒక కన్నడ హీరోయిన్ మాత్రం పట్ట పగలు,నగరం నడిబొడ్డున తప్పతాగి ,ఒంటి మీద ఉన్న టాప్ తీసేసి వీరంగం సృష్టించిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇంతకీ ఆ నటి ఎవరనే కదా? కన్నడ నటి ర్యాంబో ఫేం మాధురి.ఈ అమ్మడు ఫుల్ గా మందుకొట్టి మరికొంతమంది ఫ్యాషన్ డిజైనర్స్ తో కలిసి వీరంగం సృష్టించారు.ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రమేష్ దిమ్లా, శ్యాండిల్‌వుడ్ నటి మాధురి తో సహా ఐదుగురు గురువారం ఉదయం 8.30గంటలకు బెంగుళూరు లోని మల్లేశ్వరం 17వ క్రాస్‌లోని వీణా స్టోర్స్ వద్దకు కారు (కేఏ 05 ఎన్‌కే 7275)లో చేరుకొని బీరు బాటిల్స్ చేతిలో పట్టుకుని నడిరోడ్డు మీద వీరంగం సృష్టించారు.తప్పతాగిన వీళ్ళంతా దిక్కు తెలియకుండా అసభ్య పదజాలంతో స్థానికులను రెచ్చగొట్టడంతో పాటు రమేష్ దిమ్లా షర్ట్ విప్పి స్థానిక ప్రజలను రండిరా… చూసుకుందామని సవాల్ విసిరాడు.అర్ధనగ్న దుస్తులు వేసుకున్న మాధురి కూడా ఒంటి మీద ఉన్న జాకెట్ తీసేసి అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో మహిళలు తలలు దించుకుని వెళ్లిపోయారు.
అయితే ఈ సన్నివేశాలను కొందరు మొబైల్‌లో చిత్రీకరించారు.వీరి ప్రవర్తన మరీ శృతిమిస్తుండడంతో…స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.మల్లేశ్వరం పోలీసులు అక్కడకు చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు.దీనిపై కొందరు రాజకీయ పెద్దలు జోక్యం చేసుకుని వారిని వదిలిపెట్టాలంటూ పోలీస్ అధికారులపై ఒత్తిడి పెంచారు.
అయితే.అప్పటికే ఆ సన్నివేశాలను కొన్ని టీవీ చానెల్స్ ప్రసారం చేసేశాయి.
ఆ ఐదుగురికి వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు…వారిలో కొందరు మద్యం సేవించినట్లు గుర్తించారు.ఈమేరకు నివేదికను రూపొందించి పోలీసులకు అందించారు.