సాధారణంగా కొందరికి ముఖం మొత్తం నల్లటి మచ్చలు( Dark Spots ) ఏర్పడుతుంటాయి.ఈ మచ్చల కారణంగా అందం మొత్తం పాడవుతుం.
ది ముఖంలో గ్లో అనేది మాయమవుతుంది.ఈ క్రమంలోనే మచ్చలేని చర్మాన్ని( Spotless Skin ) పొందడం కోసం ఎన్నెన్నో ఖరీదైన క్రీములు వాడుతుంటారు.
అయినా కూడా ఫలితం అంతంత మాత్రం గానే ఉంటుంది.అయితే ఖరీదైన క్రీముల కంటే ఎఫెక్టివ్ గా పనిచేసే రెమెడీ ఒకటి ఉంది.
ఈ రెమెడీని కనుక పాటిస్తే ముఖంపై మచ్చలన్నీ కొద్ది రోజుల్లోనే దూరం అవుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పొడి( Green Tea Powder ) వేసుకోవాలి.అలాగే పావు టీ స్పూన్ పసుపు,( Turmeric ) వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్,( Aloevera Gel ) వన్ టీ స్పూన్ రోజ్ వాటర్, వన్ టీ స్పూన్ ఫ్రెష్ లెమన్ జ్యూస్, హాఫ్ టీ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి కొంచెం మందంగా అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.
రెండు రోజులకు ఒకసారి ఈ సింపుల్ రెమెడీని పాటించడం వల్ల అనేక స్కిన్ కేర్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.
ముఖ్యంగా గ్రీన్ టీ లో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు చర్మం పై ఎలాంటి మచ్చలు ఉన్న క్రమంగా పోగడ్తాయి.పసుపు, లెమన్ జ్యూస్ మచ్చలు తగ్గించడమే కాకుండా మొటిమల సమస్యకు చెక్ పెడతాయి.అలాగే అలోవెరా జెల్ మరియు బాదం ఆయిల్ చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.
డ్రై స్కిన్ సమస్యను దూరం చేస్తాయి.ఏజింగ్ లక్షణాలు త్వరగా దరిచేరకుండా అడ్డుకుంటాయి.
ఇక రోజ్ వాటర్ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.అందంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.
ఫైనల్ గా ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని ప్రయత్నించారంటే మచ్చలేని మెరిసే అందమైన చర్మం మీ సొంతం అవ్వడం గ్యారంటీ.