మనలో చాలామంది అవయవ దానం(Organ donation) గురించి వేర్వేరు సందర్భాల్లో వింటూ ఉంటారు.అవయవ దానం చేయడం వల్ల ఒక వ్యక్తి ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చు.
కెన్యాకు(Kenya) చెందిన ఒక బాలుడు తాను చనిపోయినా నలుగురికి ప్రాణం పోశాడు.ఈ బాలుడి వయస్సు కేవలం రెండు సంవత్సరాలు కాగా రెండో అంతస్తు నుంచి కింద పడటం వల్ల ఈ బాలుడి తలకు గాయం అయింది.
గత నెల 26వ తేదీన ఈ బాలుడు బ్రెయిన్ డెడ్ (Brain dead)తో మృతి చెందాడు.
అయితే లుండా తల్లి(Lunda’s mother) తన కొడుకు అవయవాలను దానం చేయడానికి ముందుకు రావడంతో మన దేశానికి చెందిన నలుగురి ప్రాణాలు నిలబడ్డాయి.
మన దేశంలో పాంక్రియాస్ గ్రంథిని దానం చేసిన అత్యంత పిన్న వయస్కుడు లుండా అని చండీగఢ్ లోని పీజీఐ ఆస్పత్రి వైద్యులు వెల్లడిస్తున్నారు.బాలుడి తల్లి మాట్లాడుతూ కొడుకు మరణంతో మా గుండె పగిలిందని చెప్పుకొచ్చారు.
అయితే మా కొడుకు చనిపోయినా కొడుకు అవయవాలు ఇతరుల ప్రాణాలను కాపాడతాయని వైద్యుల ద్వారా తెలుసుకుని అవయవదానానికి అంగీకరించామని బాలుడి తల్లి కామెంట్లు చేశారు.అవయవ దానం వల్ల తమ కొడుకు బ్రతికే ఉన్నాడని భావించడంతో పాటు కష్టాల్లో ఉన్నకొంతమందిని ఆదుకుంటున్నామని ఆమె వెల్లడించారు.
చూపు లేని వాళ్లకు, కిడ్నీ సమస్యలతో బాధ పడేవాళ్లకు లుండా అవయవాలను డొనేట్ చేశారని సమాచారం అందుతోంది.వైద్యులు మాట్లాడుతూ చిన్నపిల్లల అవయాలను మార్పిడి చేయడంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయని చెప్పారు.అయితే ఆ సవాళ్లను సైతం అధిగమించి ఈ ప్రక్రియను పూర్తి చేశామని డాక్టర్ అశిష్ శర్మ(Dr.Ashish Sharma) చెప్పుకొచ్చారు.లుండా తల్లి మంచి మనస్సును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.ఆమె బాధలో ఉన్నా ఇతరుల కష్టాలను తీర్చిన ఆమె మంచి మనస్సును ప్రశంసిస్తున్నారు.