బడ్జెట్ 7 కోట్లు.. కలెక్షన్లు 75 కోట్లు.. ఈ హిట్ మూవీ ప్రత్యేకతలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

ప్రస్తుతం ఓటీటీల ( OTT )ఎంట్రీ వల్ల ఇతర భాషల సినిమాలను సైతం తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు చూస్తున్నారు.సినిమాలకు ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా ఓటీటీలలో సబ్ టైటిల్స్ తో చూడటానికి ఆసక్తి కనబరుస్తున్నారు.

 Kishkinda Kandam Movie Ott Review Details Inside Goes Viral In Social Media ,ot-TeluguStop.com

మలయాళ మూవీ కిష్కింద కాండం కేవలం 7 కోట్ల రూపాయల బడ్జెట్ ( 7 crore budget )తో తెరకెక్కి ఏకంగా 75 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది.బడ్జెట్ తో పోల్చి చూస్తే ఏకంగా 10 రెట్ల కలెక్షన్లను సాధించింది.

దింజిత్ అయ్యతన్ ( Dinjit Ayathan )ఈ సినిమాకు దర్శకుడు కాగా ఆయన తన టేకింగ్ తో మ్యాజిక్ చేశారని చెప్పవచ్చు.మలయాళంలో హైయెస్ట్ కలెక్షన్లను సాధించిన ఈ ఏడాది టాప్ 10 సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి కావడం గమనార్హం.

ఒక్క పాట, ఒక్క ఫైట్ లెకుండా సినిమా తీయడానికి సాధారణంగా దర్శకనిర్మాతలు ఆసక్తి చూపించరు.అయితే కిష్కింద కాండం( Kishkinda Kandam ) మూవీలో ఇవి లేకపోయినా కొత్తదనంతో ఉన్న కథ, కథనం ఈ సినిమా సక్సెస్ కు కారణమయ్యాయి.

Telugu Crore Budget, Asif Ali, Dinjit Ayathan, Kishkindakandam, Malayalam, Ott R

సినిమాలో చివరి 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పవచ్చు.ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి, విజయ రాఘవన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించగా వాళ్లు తమ పాత్రలకు ప్రాణం పోశారు.ఈ సినిమా నిడివి 2 గంటల 16 నిమిషాలు కాగా ప్రస్తుతం హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.మలయాళంలో తెరకెక్కిన కొన్ని సినిమాలు తెలుగులో డబ్, రీమేక్ అయ్యి ఇక్కడ సైతం సక్సెస్ సాధించాయి.

Telugu Crore Budget, Asif Ali, Dinjit Ayathan, Kishkindakandam, Malayalam, Ott R

కథనం విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ సినిమా రేంజ్ మరింత పెరిగేది.తెలుగు భాషలో సైతం ఈ సినిమా అందుబాటులోకి రావడం గమనార్హం.థియేటర్లలో విడుదలైన 11 వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.ప్రముఖ భారతీయ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube