ఈ మధ్యకాలంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్న సంఘటనలో సోషల్ మీడియాలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం.ఈ నేపథ్యంలో అనేకమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా చూసాము.
ముఖ్యంగా నగరాలలో మహిళలు రోడ్డుపై మరణించిన సంఘటనలు ఈ మధ్యకాలంలో మరి ఎక్కువయ్యాయి.తాజాగా హైదరాబాద్( Hyderabad )లోని మాదాపూర్‌లోని కొత్తగూడ ఎక్స్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో పాదచారి యువతి ప్రాణాలు కోల్పోయింది.
మహిళ రోడ్డు దాటుతుండగా బస్సు వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదం సీసీటీవీలో రికార్డవ్వడంతో విచారణకు కీలక ఆధారాలు లభించాయి.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి హైదరాబాద్ మహిళ ప్రాణాలను బలిగొన్న ప్రమాదంపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.
సంఘటన ఖచ్చితమైన క్రమాన్ని గుర్తించడానికి, బస్సు డ్రైవర్ (Bus driver )ఏదైనా నిర్లక్ష్యంని నిర్ధారించడానికి అధికారులు సీసీటీవీ ఫుటేజీని సమీక్షిస్తున్నారు.ఈ విషాద ప్రమాదం పాదచారులు, డ్రైవర్లు రద్దీగా ఉండే రోడ్లపై, ప్రత్యేకించి భారీ ట్రాఫిక్‌కు పేరుగాంచిన కొత్తగూడ ‘ఎక్స్’ రోడ్డు వంటి ప్రాంతాలలో జాగ్రత్తగా ఉండాలని రిమైండర్‌గా ఉపయోగపడుతుంది.ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఇది ముమ్మాటికి డ్రైవర్ నిర్లక్ష్యం అంటూ పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు.
అతనిపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.అసలు అంత ఖాళీగా ఉన్న రోడ్డులో ముందర వెళుతున్న మహిళ కనపడలేదా అంటూ డ్రైవర్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు ప్రజలు.కాబట్టి ప్రజలు ఇలాంటి వాటివల్ల ఇబ్బంది పడకుండా రోడ్డుపై ప్రయాణం చేసే సమయంలో జాగ్రత్తగా ఉండడం ఎంతో అవసరం.